
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
● హోటళ్లలో తనిఖీలు చేపడుతాం
● ‘సాక్షి’ ఫోన్‌ఇన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) జె.అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలోని
రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) జె.అరుణశ్రీ తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి చక్కటి స్పందన వచ్చింది. ‘పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంటుందని, రోడ్లపై మురుగునీరు పారకుండా డ్రైయినేజీలు నిర్మించాలని, పిచ్చిమొక్కల తొలగింపు, దోమల నివారణ తదితర సమస్యలను..’ జిల్లాలోని పలువురు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సమస్య: పెద్దపల్లి పాతబజార్‌లో కల్వర్టు నిర్మించి రోడ్డు నిర్మించకుండా వదిలేశారు. 9 నెలలుగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మున్సిపాలిటీకి ఫీజులు చెల్లించకుండా అనాథరైజ్డ్ లే అవుట్లు వెలుస్తున్నాయి. బల్దియా ఆదాయాన్ని నష్టపోతోంది. చర్యలు తీసుకోండి.
– ఎం.రమేశ్‌గౌడ్, పెద్దపల్లి
అదనపు కలెక్టర్: మీరు చెప్పిన సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్‌తో చర్చిస్తాం. అనాథరైజ్డ్ లేఅవుట్లపై నేరుగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
సమస్య: పెద్దపల్లిలోని బాపూజీనగర్‌లో రోడ్డు బాగాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా గుంతలుపడ్డాయి. రోడ్డు నిర్మించే వరకు కనీసం మట్టి పోయించండి.
– అలీం, పెద్దపల్లి
అదనపు కలెక్టర్: మున్సిపల్ కమిషనర్‌కు చెప్పి మట్టిపోయించేలా చర్యలు తీసుకుంటాం. రోడ్డు నిర్మాణంపై కూడా అధికారులతో చర్చిస్తాం.
సమస్య: లక్ష్మీపురంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్డు కూడా బాగాలేదు. శ్మశానవాటికలో కనీసం బోర్ కూడా లేదు.
– రాజబాబు, లక్ష్మీపురం, ఆర్‌ఎఫ్‌సీఎల్
అదనపు కలెక్టర్: యూజీడీ, రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం. శ్మశానవాటికలో బోర్‌వెల్ ఏర్పాటు చేయిస్తాం.
సమస్య: గోదావరిఖని సంజయ్‌నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదు. పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
– బొడ్డు రాజేశం, గోదావరిఖని
అదనపు కలెక్టర్: సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ముందుగా పిచ్చి మొక్కలు, చెట్లను తొలగిస్తాం.
సమస్య: గోదావరిఖని అశోకనగర్‌లో ఎస్‌ఆర్‌ఆర్ బ్యాక్‌సైడ్‌లో రోడ్డుకు అప్రూవల్ వచ్చినా నిర్మా ణం చేపట్టలేదు. పిచ్చిమొక్కలను తొలగించాలి.
– నిజామొద్దీన్, గోదావరిఖని
అదనపు కలెక్టర్: పిచ్చిమొక్కల తొలగించేలా చ ర్యలు తీసుకుంటాం. రోడ్డును పరిశీలించా లని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశిస్తాం.
సమస్య: గోదావరిఖని ఎల్బీనగర్‌లోని సీనియర్ సిటిజన్ హాల్ వెనక సెప్టిక్‌ట్యాంక్ క్లీన్ చేయడానికి మార్గం లేదు. సమీపంలోని యూజీ డీకి కనెక్షన్ ఇవ్వండి. జవహర్‌నగర్‌లోని న వోదయ స్కూల్ సమీపంలో కల్వర్టు వద్ద రోడ్డు నిర్మించాలి.– ఉదయ్‌రాజ్, గోదావరిఖని
అదనపు కలెక్టర్: సమస్య పరిశీలనకు ఇంజినీరింగ్ విభాగం అధికారులను పంపిస్తాం.
సమస్య: రామగుండంలోని ఆటోనగర్‌లో యూ జీడీ నుంచి మురుగునీరు లీకవుతోంది. రోడ్ల నిర్మాణం చేపట్టడం లేదు. లైట్లు కూడా వెలగడం లేదు. మూడేళ్లుగా అనేక సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
– దొమ్మటి శేఖర్, ఆటోనగర్,
రామగుండం
అదనపు కలెక్టర్: వెంటనే చర్యలు తీసుకుంటాం. రామగుండం కార్పొరేషన్ అధికారులను ఆటోనగర్‌కు పంపిస్తాం.
సమస్య: పెద్దపల్లిలోని రంగంపల్లిలో పాఠశాలకు వెళ్లే రోడ్డులో పిచ్చిమొక్కలు, చెట్లు పెరిగి రాకపోకలకు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. యూజీడీ సమస్య కూడా ఉంది.
– అజ్మద్, రంగంపల్లి, పెద్దపల్లి
అదనపు కలెక్టర్: రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం.
సమస్య: గోదావరిఖని ఎల్బీనగర్‌లోని మాతంగికాంప్లెక్స్ వద్ద కుక్కలబెడద తీవ్రంగా ఉంది. సమీపంలోనే విద్యాసంస్థలున్నాయి. రోడ్డుపై వెళ్తున్న విద్యార్థులతోపాటు వాహనదారులపై దాడి చేస్తున్నాయి. గాంధీనగర్‌లో కూడా కుక్కల బెడద ఎక్కువగా ఉంది.
– దూడపాక మల్లేశ్, రవి, గోదావరిఖని
అదనపు కలెక్టర్: కుక్కల బెడద లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
సమస్య: పెద్దపల్లిలోని చాలా హోటళ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. తినుబండరాల నాణ్యత, శుభ్రత పాటించడం లేదు. ఆహారంలో బొద్దింకలు వస్తున్నాయి. హోటళ్లపై చర్యలు తీసుకోవాలి. కమాన్ దగ్గర టాయిలెట్స్ నిర్మించాలి.
– తిరుపతిగౌడ్, సదానందం, పెద్దపల్లి
అదనపు కలెక్టర్: ఇటీవల మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మరోసారి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తాం. టాయిలెట్స్ నిర్మాణంపై కమిషనర్‌కు చెబుతాం.
సమస్య: ఆర్‌ఎఫ్‌సీఎల్ సమీపంలోని చైతన్యపురి కాలనీలో మా ఇంటి ముందు యూజీడీ నిర్మాణం కోసం తవ్వి వదిలేశా రు. మా ఇంట్లో వెళ్లడానికి కర్రలు వేసుకొని నడుస్తాం. మా నాన్న అదుపుతప్పి పడిపోయాడు. చర్యలు తీసుకోండి.
– రవి, గోదావరిఖని.
అదనపు కలెక్టర్: సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
సమస్య: ఎన్టీపీసీలోని ఇందిరమ్మకాలనీ హనుమాన్‌గుడి సమీపంలో రోడ్డు నీటితో నిండిపోయి ప్రమాదకరంగా ఉంది. ఈ రోడ్డుపై నేను కూడా జారిపడ్డాను. వెంటనే సమస్య పరిష్కరించాలి.
– బండి పల్లవి, ఎన్టీపీసీ
అదనపు కలెక్టర్: చర్యలు తీసుకుంటాం. రామగుండం మున్సిపల్ అధికారులను పంపిస్తాం.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి