‘బహుళ’ ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

‘బహుళ’ ప్రమాదాలు

Jul 3 2025 4:50 AM | Updated on Jul 3 2025 4:50 AM

‘బహుళ

‘బహుళ’ ప్రమాదాలు

గోదావరిఖని శ్రీనగర్‌కాలనీలోని సింగరేణి ఉద్యోగి ఇంట్లో గతనెల 29న వంటగ్యాస్‌ లీకై ంది. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. వస్తుసామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే పొగ వ్యాపించడంతో ఇంటి యజమాని స్వల్ప అస్వస్థకు గురయ్యాడు.

గోదావరిఖని: జిల్లాలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా వెలుస్తున్నాయి. ప్రస్తుత జనాభా అవసరాలకు అనుగుణంగా అపార్ట్‌మెంట్లు అనేకం నిర్మిస్తున్నారు. లిఫ్ట్‌లు, స్పెషల్‌ డిజైన్లలో నిర్మిస్తున్న అందమైన అంతస్తులు సరికొత్త శోభ తెచ్చిపెడుతున్నాయి. ఇదేసమయంలో భద్రతా చర్యలు విస్మరించడంతో తరచూ అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, ఇతరత్రా ప్రమాదాలు చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

తక్కువ ఎత్తులో నిర్మిస్తూ..

నిబంధనల ప్రకారం నివాస యోగ్యమైన అపార్ట్‌మెంట్లు 15 మీటర్లు, వాణిజ్య భవనాల ఎత్తు 18 మీటర్లు ఎత్తు ఉంటే ఫైర్‌సేఫ్టీ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ, ఇంతకన్నా తక్కువ ఎత్తులో నిర్మిస్తున్న భవనాలకు అనుమతి అవసరం లేకపోవడంతో కొందరు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారు. కానీ, ప్రమాదాలు చోటుచేసుకుంటే హైరానా పడడం తప్ప చేసేదేమీ ఉండడంలేదు.

వంట గ్యాస్‌ లీక్‌.. షార్ట్‌ సర్క్యూట్‌..

బహుళ అంతస్తుల్లో ప్రధానంగా వంటగ్యాస్‌ లీక్‌, షార్ట్‌షర్క్యూట్‌తోనే అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. దీంతోనే అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోగా జరిగే నష్టం జరిగిపోతోంది. అనుమతితో సంబంధం లేకుండా రక్షణ చర్యలు పాటించడం, భద్రతా చర్యలు తీసుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు చొరవ తీసుకుంటే ప్రమాదాల నివారణ సాధ్యమని అంటున్నారు.

నివాసాల్లో అగ్ని ప్రమాదాల నివారణ ఇలా..

● పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు, మండే పదార్థాలు అందుబాటులో ఉంచవద్దు

● సిగిరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా పారేయరాదు

● ఐఎస్‌ఐ ఎలక్ట్రికల్‌ పరికరాలనే ఉపయోగించాలి

● పాడైన విద్యుత్‌ తీగలు తాకొద్దు. ఓవర్‌ లోడ్‌ వేయవద్దు. నాణ్యమైన ప్లగ్‌ మాత్రమే వాడాలి.

● మంచంపై పడుకుని బీడీలు, సిగరెట్లు తాగొద్దు.

● ఎక్కువరోజులు బయటకు వెళ్లాల్సి వస్తే విద్యుత్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయాలి

● నీటి నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలి

● వంటింటి కింద, పైభాగంలో గాలి, వెలుతురు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి

● పిల్లలను వంటగదుల్లో వదలరాదు

● ఐఎస్‌ఐ మార్కు గల కొత్త గ్యాస్‌పైపు వాడాలి

● వంటలు పూర్తయ్యాక వెంటనే రెగ్యులేటర్‌ వాల్వ్‌ ఆఫ్‌చేయాలి

● గ్యాస్‌ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్‌ వాల్వ్‌ ఆపేయాలి. ఆ వెంటనే విద్యుత్‌ స్విచ్‌లు ఆన్‌, ఆఫ్‌ చేయవద్దు

● తాటాకు, గడ్డితో తయారు చేసిన పైకప్పును స్కూళ్లు, ఆస్పత్రుల్లో వాడవద్దు

● ఫ్లేమ్‌ప్రూఫ్‌ మోటార్‌ స్పార్క్‌ స్విచ్‌లనే ఉపయోగించాలి

● స్కూళ్లు, ఆస్పత్రులు, షాపింగ్‌ మాల్స్‌లో ఫైర్‌ఫైటింగ్‌ ఎగ్జిష్టర్లను అందుబాటులో ఉంచాలి

● ఫైర్‌ ఎవాక్యుయేషన్‌ డ్రిల్లును ప్రతీ మూడునెలలకోసారి ప్రాక్టీసు చేయాలి

● వంటగదిలో కిరోసిన్‌, డీజిల్‌, పెట్రోల్‌, అదనపు గ్యాస్‌ సిలిండర్‌ వంటివి ఉంచరాదు

● వంట చేస్తున్నప్పుడు నూలు వస్త్రాలు, ఆఫ్రిన్‌ ధరించాలి.

వ్యక్తిగత జాగ్రత్తలు..

● దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తవద్దు. నేలపై దొర్లండి లేదా దుప్పటి చుట్టుకోవాలి

● కాలిన శరీరపై చల్లని నీరు పోయరాదు

● పొగతో నిండిన గదుల్లో మోచేతులు. మోకాళ్లపై పాకరాదు. ముక్కు, నోటికి అడ్డుగా తడిగుడ్డ పెట్టుకోవాలి.

గ్రామాల్లో..

● ఎండిన గడ్డినే వాముగా వేయాలి

● నివాసాలకు 60 అడుగుల దూరంలో వాములు వేయాలి

● పెద్దగడ్డివాములకు బదులుగా చిన్నవి వేయాలి

● గుడిసెలకు మధ్య కనీసం 30 అడుగుల దూరం పాటించండి

● విద్యుత్‌ ప్రమాదాలపై నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి.

నిబంధనలకు తిలోదకాలు

అపార్ట్‌మెంట్లలో భద్రత చర్యలు గాలికి

అగ్నిమాపక కేంద్రాల ఫోన్‌ నంబర్లు

పెద్దపల్లి 87126 99202

గోదావరిఖని 87126 99206

మంథని 87126 99204

జాగ్రత్తలు తీసుకోవాలి

వర్షాకాలంలో కుంటలు, జలపాతాల వద్దకు స్నానాలకు వెళ్లవద్దు. వరదల సందర్భంగా అజాగ్రత్తగా ఉండొద్దు. ఇంట్లో దేవునికి దీపం వెలిగించి ఊరికి వెళ్తే ఎలుకలతో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంది. నూనెను తాగిదీపం వత్తిని ఎలుకలు తీసుకెళ్తాయి. ఈవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కింద బట్టలు ఉంటే పైన అగర్‌బత్తులు వెలిగించరాదు. ఏ ప్రమాదం జరిగినా అగ్నిమాపక సిబ్బందిని వెంటనే సంప్రదించాలి.

– అనిల్‌కుమార్‌, జిల్లా అగ్నిమాపక అధికారి

‘బహుళ’ ప్రమాదాలు1
1/2

‘బహుళ’ ప్రమాదాలు

‘బహుళ’ ప్రమాదాలు2
2/2

‘బహుళ’ ప్రమాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement