
నీరు కలుషితం.. జనం సతమతం
‘ఇది రామగుండం బల్దియా గోదావరిఖని అశోక్‌నగర్‌లోని ఓ వీధి. ఇక్కడ తరుచూ తాగునీటి పైప్‌లైన్ లీకవుతోంది. 45 రోజుల క్రితమే సీసీ రోడ్డు వేయగా పైప్‌లైన్ పగిలింది. గత్యంతరం లేక బల్దియా అధికారులు వేసిన కొత్త రోడ్డును తవ్వించి పైప్‌లైన్‌కు మరమ్మతు చేయించారు. కానీ, ఇదే పైప్‌లైన్‌కు మరో చోట పగుళ్లుచూపడంతో తాగునీరంతా కలుషితమవుతోంది. మరోసారి లీకేజీకి మరమ్మతులు చేపట్టారు. పాత పైపును తొలగించి కొంత భాగం కొత్త పైప్‌లను ఏర్పాటు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. మిగిలిన పాతపైప్‌లైన్‌కు మరోచోట లీకేజీ ఏర్పడింది. దీంతో మూడురోజులుగా అధికారులు మరమ్మతు చేయిస్తున్నారు. తరుచూ లీకేజీలతో తాగునీరంతా కలుషితం అవుతుండడంతో, స్థానిక కుటుంబాలు ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం, ఇలా లీకేజీలతో తాగునీరంతా కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒక్క అశోక్‌నగర్‌లోనే కాదు.. చాలా డివిజన్లలో తాగునీటి పైప్‌లైన్ల లీకేజీలతో జనం పరేషాన్ అవుతున్నారు’.
‘ఈ ఫొటో మార్కండేయకాలనీలోని రెయిన్‌బో స్కూల్ పక్కనున్న కల్వర్టు ప్రాంతం. నగరపాలక సంస్థకు చెందిన తాగునీటి పైప్‌లైన్‌కు ఏర్పాటు చేసిన వాల్వ్ నుంచి తాగునీరు భారీగా లీకవుతోంది. దీనికి తోడు భారీ వర్షాలు కురిసినప్పుడల్లా కల్వర్టు వరకు వరద, మురుగునీరు నాలా నుంచి ప్రవహిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో వాల్వ్ లీకేజీతో తాగునీరు కూడా కలుషితమయ్యే అవకాశాలున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బల్దియా అధికారులు స్పందించి మరమ్మతు చేపట్టాలని కోరుతున్నారు’.
వాటర్ ప్లాంట్‌లో కొంటున్నాం
పైప్‌లైన్ల లీకేజీతో తాగునీరు కలుషితమవుతోంది. మా వాడలో నెల రోజులుగా తరుచూ పైప్‌లైన్లు పగులుతున్నాయి. పాత పైపులను తొలగించి, కొత్త పైప్‌లైన్లు వేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అసలే వానకాలం, కలుషితమైన నీళ్లను ఎలా తాగేది..?. వాటర్ ప్లాంట్ల నుంచి రోజూ తాగునీటి కొనుక్కోవాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
– తోట రవి, అశోక్‌నగర్, గోదావరిఖని
●
మున్సిపాలిటీల్లో పైప్‌లైన్ల మరమ్మతుపై నిర్లక్ష్యం పొంచిఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు

నీరు కలుషితం.. జనం సతమతం

నీరు కలుషితం.. జనం సతమతం