
పేదల సంక్షేమమే లక్ష్యం
జ్యోతినగర్(రామగుండం): పేదల సంక్షేమమే ప్ర జాప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. జంగాలపల్లె శివారులోని డబుల్‌బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర పనులకు బల్దియా కమిసనర్ అరుణశ్రీతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మహంకాళి స్వామి, రహీం, ఈదునూరి రవి తదితరులు పాల్గొన్నారు. కాగా, నర్రాశాలపల్లె, మల్కాపూర్ ప్రాంతాల్లో ఇటీవల మృతి చెందిన చిలుముల గట్టయ్య, శ్రీరాముల రవి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ పరామర్శించారు.
కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు కోసం కృషి
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపుకోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అ న్నారు. ఖాజీపల్లిలో నిర్వహించిన ముఖ్య నాయకు లు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడా రు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయా లని సూచించారు. నియోజకవర్గ ఎన్నికల పరిశీల కులు అజ్మతుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాస్ ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాశ్, అనిల్‌కూమార్, మహేశ్, ముస్తఫా, ఎల్లయ్య, రహీం, శంకర్ నాయక్ పాల్గొన్నారు.