
కమిషనరేట్‌ను జాతీయస్థాయిలో నిలపాలి
● రామగుండం సీపీ అంబర్‌కిషోర్ ఝా
గోదావరిఖని(రామగుండం): క్రీడల్లో సత్తా చాటి రామగుండం పోలీస్ కమిషనరేట్‌ను జాతీయస్థాయిలో నిలపాలని సీపీ అంబర్‌కిషోర్‌ఝా పేర్కొన్నారు. గురువారం పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌లో కాళేశ్వరం జోన్‌స్థాయి పోలీస్‌డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆర్మ్‌డ్‌రిజర్వ్ విభాగాలైన డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం పనితీరును పరిశీలించారు. పోలీసు జాగిలాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నేర స్థలంలో బాంబులు, గంజాయిని గుర్తించడంపై పోటీలు నిర్వహించారు. బాంబు డిస్పోజల్ టీంల సెర్చ్, డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్ ద్వారా భూమిలోపల పాతిపెట్టిన మందుగుండు సామగ్రి తదితర పోటీలు ఆకట్టుకున్నాయి. పోలీసు అధికారులు, సిబ్బందిలో ప్రతిభను వెలికితీసేందుకు పోలీసు డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందఅన్నారు. విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం చాలా కీలకమన్నారు. డ్యూటీమీట్‌లో 91మంది అధికారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వారిని వరంగల్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, గోదావరిఖని ఏసీపీ రమేశ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, సీసీఎస్ సీఐ బాబురావు, ఆర్‌ఐలు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సిబ్బంది పాల్గొన్నారు.