
ప్రజలు సుభిక్షంగా ఉండాలి
● ఎంపీ వంశీకృష్ణ
రామగిరి(మంథని): అమ్మవారి దయతో అందరూ సుభిక్షంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆకాంక్షించారు. అడ్రియాల గని ఆవరణలో బుధవారం చేపట్టిన పోచమ్మ బోనాల ఉత్సవం సందర్భంగా ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మకు సమర్పించే బోనం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీ నాయకులు పాల్గొన్నారు.
సేవలతోనే మంచిగుర్తింపు
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తప్పదని, అయితే అంకితభావంతో పనిచేస్తే మంచిగుర్తింపు లభిస్తుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన శోభారాణి వీడ్కోలు సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా విద్యాధికారి మాధవి, ఎంపీ వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు. భావిభారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా శోభారాణి– ఈర్ల కొమురయ్య దంపతులను సత్కరించారు. ఎంఈవో సురేందర్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జీవన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.