
చర్యలు తీసుకోవాలి
ఓపెన్ ప్లాట్లలోని పిచ్చిమొక్కలతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. వర్షాకాలానికి ముందే ప్లాట్ల యజమానులను గుర్తించి నోటీసులు ఇవ్వాలి. వారు స్పందించకుంటే జరిమానా విధించాలి. కానీ, ఇలాంటి నిబంధనలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మార్కండేయకాలనీలో పిచ్చిమొక్కలు వెంటనే తొలగించాలి.
– నామని మల్లేశ్, గోదావరిఖని
మురికికూపాలతో వ్యాధులు
పెద్దపల్లిలో కొత్త ఇండ్ల నిర్మాణం పెరిగింది. కాలనీల్లో డ్రైనేజీలు కట్టడంలేదు. వ్యర్థపు నీరు, చెత్తాచెదారం ఇండ్ల నడుమ ఖాళీ జాగాల్లో చేరుతోంది. సమీప ప్రజలకు వ్యాధులను అంటగడుతున్నాయి. అధికారులు చొరవచూపి ప్లాట్ యజమానులతో ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలి. పారిశుధ్యం మెరుగుపర్చాలి.
– ఉప్పు కిరణ్, పెద్దపల్లి

చర్యలు తీసుకోవాలి