గోదావరిఖని: బహిరంగ ప్ర దేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. అనుమతిలేని డ్రోన్, డీజే సౌండ్స్‌పైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. మహిళలు, పౌరుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కమిషరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో ఈనెలాఖరు వరకు నిషేధాజ్ఞలు కొనసాగిస్తామన్నారు.
ఎన్టీపీసీ జీఎంకు పదోన్నతి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఆ పరేషన్, మెయింటనెన్స్ జనరల్ మేనేజర్ అలో క్ త్రిపాఠి చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. మంగళవారం స్థానిక పరిపాలన భ వనంలో అలోక్ త్రిపాఠిని ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, జనరల్ సెక్రటరీ ఆరెపల్లి రాజేశ్వర్, గోపాలరావు, కొలని వెంకటరెడ్డి, రమేశ్, రాజేశం సన్మానించారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ ఇన్‌చార్జిగా ఖుల్బే
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం) : రామగుండం ఎరువుల కర్మాగారం సీజీఎం, ప్రాజెక్ట్ హెచ్‌వోడీ ఉదయ్ రాజహంస జూన్ 30న ఉద్యోగ విరమ ణ పొందారు. దీంతో ఆర్‌ఎఫ్‌సీఎల్ ఇన్‌చార్జిగా రాజీవ్ ఖుల్బేను నియమిస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫెర్టిలై జర్స్ లిమిటెడ్ కర్మాగారంలో 1988లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ప్రస్థానం ప్రారంభించారు. ఖు ల్బేకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీపీసీలో ఏఐ ఆధారిత సేవలు
జ్యోతినగర్(రామగుండం): ప్రాజెక్టులోని జీ ఎంలు, ఏజీఎంల స్థాయి అధికారులు ఏఐ ఆ ధారిత సేవలను అందిపుచ్చుకుని విధులు ని ర్వర్తించాలని రామగుండం ఎన్టీపీసీ – తెలంగా ణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కు మార్ సామంత సూచించారు. ఎన్టీపీసీ మిలీని యం హాల్‌లో ఏఐపై మంగళవారం చేపట్టిన స దస్సులో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ఏఐ ఆధారంగా విధుల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, ఇందుకోసం తమ విజ్ఞానం నవీకరించుకోవాలన్నారు. ఏఐ వక్త కిరుబా శంకర్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, డిజిటల్ వ్యూహా ల్లో ఏఐ పరివర్తన– ప్రభావం గురించి వివరించారు. ఏజీఎం(హెచ్‌ఆర్) బిజయ్‌కుమార్ సిగ్ద ర్, ఏజీఎం మనోజ్ ఝా, కార్పొరేట్ కమ్యూని కేషన్ ఎగ్జిక్యూటివ్ రూపాలి రంజన్ ఉన్నారు.
సమ్మె విజయవంతం చేయాలి
గోదావరిఖని: కార్మికుల హక్కుల పరిరక్షణ కో సం ఈనెల 9న దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామ య్య, అక్రమ్, టి.రాజారెడ్డి, మిర్యాల రాజిరె డ్డి, కె.విశ్వనాథ్ కోరారు. ఆర్జీ–2 ఏరియా ఓ సీపీ–3పై మంగళవారం ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో వారు మాట్లాడారు. బీజేపీ ప్రభు త్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. నాయకులు వైవీ రావు, జిగురు రవీందర్, ప్రకాశ్, అన్నారావు, రాజర త్నం, రాంచందర్, శ్యాంసన్, రవికుమార్, మ హేందర్, రవీందర్, సాగర్, కుమారస్వా మి, సత్యనారాయణరెడ్డి, సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇకనుంచి బయోమెట్రిక్ హాజరు
పెద్దపల్లిరూరల్: జిల్లా, మండల పరిషత్ కా ర్యాలయాల్లో ఫేషియల్ రికగ్నేషన్ హాజరు (బ యోమెట్రిక్ అటెండెన్సు) విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు జెడ్పీ సీఈవో నరేందర్ తెలిపారు. సమయపాలన, విధుల్లో పారదర్శకత కోసం ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికా రులు ఆదేశాలిచ్చారని ఆయన వివరించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
పెద్దపల్లిరూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి ఆదేశించారు. తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించా రు. ఆరోగ్య, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయ తీ కార్యాలయాల వద్ద ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని, స్కూళ్లలో ఓఆర్‌ఎస్ తయారీపై అవగాహన కల్పించాలని అన్నారు.
మద్యపానంపై నిషేధాజ్ఞలు
మద్యపానంపై నిషేధాజ్ఞలు
మద్యపానంపై నిషేధాజ్ఞలు
మద్యపానంపై నిషేధాజ్ఞలు