కాపర్‌వైర్‌ చోరీ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కాపర్‌వైర్‌ చోరీ ముఠా అరెస్ట్‌

Mar 2 2025 1:03 AM | Updated on Mar 2 2025 1:02 AM

రామగుండం: రైతుల పంట పొలాల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి తీగను దొంగిలించే ముఠాను అంతర్గాం పోలీసులు చాకచక్యంగా పట్టుకొని రాగి తీగను స్వాధీనం చేసుకున్నారు. అంతర్గాం ఎస్సై బోయ వెంకటస్వామి తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేస్తున్న విషయమై టీఎస్‌పీడీసీఎల్‌ ఏఈ ఆశ శంకర్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిఘా పెట్టి శనివారం బ్రాహ్మణపల్లి ఎక్స్‌రోడ్‌ సమీపంలో ఆటోలో వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో అనుమానితులను గుర్తించి విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. ఇందులో ఇప్పటికే 14 కేసుల్లో నిందితులుగా ఉన్న ముఠాగా గుర్తించారు. కాగా ఫిబ్రవరి 23న ఈ కేసులో ఏ1గా ఉన్న సిరిగిరి అంజన్న (వెల్గటూర్‌–కోటిలింగాల), ఏ5గా ఉన్న వారణాసి వంశీలను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా మిగతా సభ్యులు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో శనివారం మిగతా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఇందులో చింతల చంద్రమౌళి అలియాస్‌ బుజ్జి (వెల్గటూర్‌– కప్పట్రావుపేట), వారణాసి లక్ష్మణ్‌ అలియాస్‌ అద్రాసి లక్ష్మణ్‌ (మంచిర్యాల ఎన్టీఆర్‌ కాలనీ), చింతల శ్రీనివాస్‌ అలియాస్‌ చితారి శ్రీను (మంచిర్యాల ఎన్టీఆర్‌ కాలనీ) ముఠాగా ఏర్పడి మంథని, ఎన్టీపీసీ, బసంత్‌నగర్‌, వెల్గటూర్‌, గొల్లపల్లి, ధర్మపురి తదితర పోలీస్‌స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి రాగి తీగను దొంగిలించగా, ఇప్పటికే 14 కేసులు నమోదైనట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement