
భాగ్యరెడ్డివర్మ సేవలు చిరస్మరణీయం
● రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా
గోదావరిఖని(రామగుండం): భాగ్యరెడ్డివర్మ సేవలు చిరస్మరణీయమని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. గురువారం భాగ్యరెడ్డివర్మ జయంతిని కమిషనరేట్ మీటింగ్‌హాల్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా వర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, భాగ్యరెడ్డివర్మ హైదరాబాద్ సంస్థానంలో సంఘ సంస్కరణకు కృషి చేసిన మహానీయుడన్నారు. ఆంధ్రసభ స్థాపకుడిగా హైదరాబాద్‌లో దళిత పాఠశాలను ప్రారంభించి, దళితుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. అడిషనల్ డీసీపీ రాజు, స్పెషల్‌బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.