
అప్రమత్తతతోనే కరోనా దూరం
● పౌష్టికాహారం తీసుకోవాలి ● తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి ● రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం మేలు ● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి
పెద్దపల్లిరూరల్: ‘రాష్ట్రంలో ఇప్పటివరకు ‘కరోనా’ వైరస్ లక్షణాలు కనిపించకపోయినా.. పొరుగున ఉన్న మహారాష్ట్రతో ముప్పు పొంచి ఉంది. అందుకే జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ రోగనిరోధకశక్తిని పెంచే పోషక విలువలున్న ఆహారపదార్థాలను తీసుకోవాలి’ అని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నప్రసన్నకుమారి అన్నారు. చైనా, హాంకాంగ్, బర్మా, టిబెట్ తదితర దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మన దేశంలోని కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందుతోందని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. గురువారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా ప్రజల సందేహాలకు సమాధానాలిచ్చారు.