పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి

May 23 2025 3:05 PM | Updated on May 23 2025 3:05 PM

పూడిక

పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి

సుల్తానాబాద్‌రూరల్‌/ఓదెల: ఎస్సారెస్పీ కాలువలో పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. గురువారం సుల్తానాబాద్‌ మండలం సుద్దాల, ఓదెల మండల శివారులో ఉపాధి హామీలో చేపట్టిన కాలువల పూడికతీత పనులను పరిశీలించారు. వానాకాలంలోగా మెయిన్‌, డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలని సూచించారు. అంతకుముందు ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. డీఆర్డీఏ పీడీ కాళిందిని, ఎంపీడీవోలు దివ్యదర్శన్‌రావు, తిరుపతి, ఎంపీవో షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని నోడల్‌ అధికారి కల్పన తెలిపారు. పరీక్షలకు 1,124 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 1,063 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 61మంది హాజరుకాలేదని వివరించారు.

ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

గోదావరిఖని(రామగుండం): జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలతో రామగుండం రీజియన్‌లోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–5 ఓసీపీ, ఆర్జీ–2 ఏరియాలోని ఓసీపీ–3, ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ–1,2లో ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

‘ఎల్లంపల్లి’కి స్వల్ప ఇన్‌ఫ్లో

రామగుండం: రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. గురువారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.98 టీఎంసీలు ఉండగా, గతేడాది ఇదే రోజు కేవలం 5.52 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,114 క్యూసెక్కులు కాగా, హైదరాబాద్‌ మెట్రో 331, పెద్దపల్లి–రామగుండం మిషన్‌ భగీరథ 58, మంచిర్యాల 23, ఆవిరయ్యే నీరు 174 మొత్తం 586 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. గతేడాది ఈ సమయంలో ఏలాంటి ఔట్‌ఫ్లో లేదు.

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు

ముత్తారం: ఆయిల్‌పాం సాగుతో రైతులకు అధిక దిగుబడులు వస్తాయని ఐఐఓపీఆర్‌ ప్రధాన శాస్త్రవేత డాక్టర్‌ రామచంద్రుడు పేర్కొన్నారు. గురువారం ముత్తారం రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. దేశంలో ఆయిల్‌పాం కంటే ఏ ఇతర పంటలకు డిమాండ్‌ లేదని తెలిపారు. అంతర పంటలుగా బొప్పాయి, మునగ, అల్లం తదితర వాటితో లాభాలు పొందవచ్చన్నారు. ఆయిల్‌పాం చెట్టు నుంచి వచ్చే వ్యర్థాలు మళ్లీ పంటలకు ఉపయోగపడుతాయని వివరించారు. నీటాఫామ్‌ డీజీఎం సుబ్బారావు మాట్లాడుతూ, ఆయిల్‌పాం సాగులో బిందుసేద్యంతో నీటి ఆదా అవుతుందనన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాదికి 2,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అనంతరం ముత్తారంలోని ఆయిల్‌పామ్‌ పంటలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ అల్లాడి యాదగిరిరావు, కృషి విజ్ఞానిక కేంద్రం రామగిరి శాస్త్రవేత్త భాస్కర్‌రావు, ఉద్యానశాఖ అధికారి ఎ.జ్యోతి, ఏడీఏ అంజని, ఏవో అనూష, తిరుమల ఆయిల్‌పాం కంపెనీ సీఈవో కళ్యాణ్‌కర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ అజయ్‌, రంజిత్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పూడికతీత పనులు   త్వరగా పూర్తి చేయాలి1
1/2

పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి

పూడికతీత పనులు   త్వరగా పూర్తి చేయాలి2
2/2

పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement