
వర్షం.. తడిసిన ధాన్యం
పెద్దపల్లిరూరల్/మంథని/జూలపల్లి/సుల్తానాబాద్/రామగుండం/పాలకుర్తి/యైటింక్లయిన్‌కాలనీ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లాకేంద్రంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మంథనిలోని లోతట్టు ప్రాంతాల రోడ్ల వెంట వరద పారింది. జూలపల్లి మండలంలోని పలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. రామగుండం పట్టణంలోని పలు కాలనీల్లోకి నీరు చేరింది. పాలకుర్తి మండలం బసంత్‌నగర్ పంచాయతీ భవనం పక్కన చెట్టు ఈదురుగాలులకు నేలకూలింది. రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీలో రోడ్లు జలమయమయ్యాయి.

వర్షం.. తడిసిన ధాన్యం