
మార్పులకనుగుణంగా బోధించాలి
జ్యోతినగర్(రామగుండం): విద్యా విధానంలో వస్తున్న నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు విద్యా బోధన చేయాలని స్టేట్ అబ్జర్వర్ ఎన్‌వీ దుర్గాప్రసాద్ అన్నారు. ఎన్టీపీసీ రామగుండం టీటీఎస్ జెడ్పీ హైస్కూల్‌లో మూడు రోజులుగా జిల్లాలోని 14 మండలాలకు చెందిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని గురువారం సందర్శించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. శిక్షణలో హెచ్‌ఎంలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, కోర్సు డైరెక్టర్ జయరాజు, ఎంఈవో చంద్రయ్య, రిసోర్స్‌పర్సన్స్ ఆగయ్య, రాగమణి, భవాని, పురుషోత్తం, టెక్నికల్ పర్సన్ దినేశ్, సీఆర్‌పీలు వెంకటేశ్, రామ్‌కుమార్ పాల్గొన్నారు.
అభ్యసన సామర్థ్యాలను వెలికి తీయాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): శిక్షణ నైపుణ్యంతో ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని అభ్యసన సామర్థ్యాలను వెలికి తీయాలని రాష్ట్ర పరిశీలకుడు దుర్గాప్రసాద్ అన్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జరుగుతుండగా గురువారం జిల్లా సెక్టోరల్ అధికారి కవితతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. రిసోర్స్ పర్సన్స్ నరేశ్, కుమార్, సాధన, ప్రత్యక్ష ఉన్నారు.
విద్యార్థుల సంఖ్యను పెంచాలి
పాలకుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని రాష్ట్ర పరిశీలకుడు దుర్గాప్రసాద్ సూచించారు. పాలకుర్తి మండలం బసంత్‌నగర్ జెడ్పీ పాఠశాలలో వేసవి శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.