సగం ఆమెవే!
● తక్షణం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ●ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ● 28న పోలింగ్.. 30న ఫలితాలు వెల్లడి ● తొలి దశలోనే మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు
●ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో సగం మహిళలకే కేటాయింపు ●రెండు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ పీఠం సైతం ఆమెదే..
జననేతను చూసి... మురిసిపోయిన ప్రజానీకం
వైఎస్ జగన్తో వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి గదల సన్యాసినాయుడు
సాక్షి, పార్వతీపురం మన్యం:
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. రాజకీయ పార్టీల నాయకులు చేపట్టే ఏ కార్యక్రమాల్లోనూ అధికారులు పాల్గొనకూడదు. తొలి దశలో జిల్లాలోని పార్వతీపురం (36 వార్డు లు), సాలూరు (32వార్డులు) మున్సిపాలిటీలతో పాటు.. పాలకొండ నగర పంచాయతీ (28 వార్డు లు)కి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఓట రు జాబితాలను ప్రదర్శించనున్నారు. అదే రోజున ఎన్నికల నోటిఫికేషన్ జారీతో పాటు.. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది. ఈ నెల 18వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 19న పరిశీలన జరుపుతారు. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉప సంహరణకు గడువిచ్చారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ నెల 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. నవంబర్ 3న ఎంపీటీ సీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మొత్తం 15 స్థానాలకు ఎస్టీ–5, ఎస్సీ– 2, అన్ రిజర్వుడు–8 ఉన్నాయి. మొత్తంగా మహిళలకే ఏడు స్థానాలు కేటాయించారు. మండలాల వారీగా.. కొమరాడ – ఎస్టీ మహిళ, వీరఘట్టం–అన్ రిజర్వుడు, గుమ్మలక్ష్మీపురం– ఎస్టీ, సాలూరు–అన్ రిజర్వుడు(మహిళ), మక్కువ–ఎస్టీ, సీతానగరం–అన్ రిజర్వుడు(మహిళ), కురుపాం–అన్ రిజర్వుడు, సీతంపేట–ఎస్టీ, భామిని ఎస్టీ (మహిళ), పాలకొండ–ఎస్సీ, పార్వతీపురం – అన్ రిజర్వుడు, బలిజిపేట–అన్ రిజర్వుడు (మహిళ), గరుగుబిల్లి– ఎస్సీ(మహిళ), పాచిపెంట – అన్ రిజర్వుడు (మహిళ), జియ్యమ్మవలస – అన్ రిజర్వుడు కేటగిరీ కింద కేటాయించారు.
వివిధ మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) స్థానా ల కేటాయింపు, రిజర్వేషన్ల వివరాలిలా ఉన్నాయి. మొత్తం 15 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు సంబంధించి ఎస్టీలకు 5, ఎస్సీలకు 2, అన్ రిజర్వుడు 8 చొప్పున కేటాయించారు. ఇందులో మహిళలకే ఎనిమిది సీట్లు దక్కుతున్నాయి.
●కొమరాడ మండలం – ఎస్టీ, వీరఘట్టం –ఎస్సీ (మహిళ), గుమ్మలక్ష్మీపురం – ఎస్టీ (మహిళ ), సా లూరు–అన్ రిజర్వుడ్, మక్కువ–అన్ రిజర్వుడు(మహిళ), సీతానగరం–ఎస్సీ, కురుపాం–ఎస్టీ (మ హిళ), సీతంపేట–ఎస్టీ (మహిళ), భామిని– ఎస్టీ కేటగిరీలకు కేటాయించారు. పాలకొండ మండలం – అన్ రిజర్వుడు (మహిళ), పార్వతీపురం మండ లం – అన్ రిజర్వుడ్, బలిజిపేట–అన్ రిజ ర్వుడు(మహిళ), గరుగుబిల్లి–అన్ రిజర్వుడ్, పాచిపెంట–అన్ రిజర్వుడ్, జియ్యమ్మవలస–అన్ రిజర్వుడు(మహిళ) కేటగిరీ కింద నిర్ణయించారు.
స్థానిక ఎన్నికల్లో మహిళల హవా నడుస్తోంది. ఇప్పటికే పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష స్థానాలను అతివలకు కేటాయించిన విషయం విదితమే. ఇప్పుడు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లోనూ సగం వారికే దక్కడం గమనార్హం. రిజర్వేషన్ల ప్రకారం పదవుల్లో మహిళలు అయితే ఉంటున్నారు గానీ.. ‘అధికారం’ మాత్రం పతుల చేతుల్లోనే ఉంటోంది. పాలన లో నిర్ణయాలు తీసుకునే అధికారం వారి వద్దే అట్టిపెట్టుకుంటున్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని మొత్తం 15 జెడ్పీటీసీ, 15 ఎంపీపీ స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్.ప్రభాకర రెడ్డి బుధవారం అధికారికంగా ప్రకటించారు.


