8,600 లీటర్ల సారా ఊట ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

8,600 లీటర్ల సారా ఊట ధ్వంసం

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

8,600 లీటర్ల సారా ఊట ధ్వంసం

● సరిహద్దులో ఎకై ్సజ్‌ దాడులు

● రాయగడ జిల్లాలో 4 కేసులు నమోదు

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోకి ఒడిశా నుంచి సారా అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎకై ్సజ్‌ అధికారులు దాడులు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎ.సంతోష్‌ నేతృత్వంలో బుధవారం ఈ అంతర్రాష్ట్ర ఆపరేషన్‌ నిర్వహించారు. ఒడిశాలోని రాయగడ జిల్లా పరిధిలో కెరడ, అనేజా గ్రామాల్లో ఏపీ ఎకై ్సజ్‌ అధికారులు, ఒడిశాలోని శేషఖాల్‌ పోలీసుల సహకారంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో కురుపాం, సీతానగరం ఎకై ్సజ్‌ సిబ్బందితో పాటు పార్వతీపురం, విజయనగరం ఎనన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ఈ సోదాల్లో సారా తయారీకి సిద్ధం చేసిన సుమారు 8,600 లీటర్ల ఎఫ్‌జె ఊటను అధికారులు గుర్తించి, అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌న్‌లో భాగంగా మొత్తం 4 కేసులు నమోదు చేశారు. సరిహద్దుల్లో సారా రవాణాను అరికట్టేందుకు రాబోయే రోజుల్లోనూ ఇలాంటి దాడులు కొనసాగిస్తామని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement