సమర్థవంతంగా ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా ‘సర్‌’

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

సమర్థవంతంగా ‘సర్‌’

పార్వతీపురం: జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ సమర్థ్ధవంతంగా సాగుతోందని ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ జె.వెంకటమురళి ప్రశంసించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలితో కలిసి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. పరిమిత వనరులు, సవాళ్లు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితా సవరణలో అధికారులు మెరుగైన పనితీరు కనబరుస్తున్నారని అబ్జర్వర్‌ కొనియాడారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న అధికారులను కలెక్టర్‌ అభినందించారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్లు సచిన్‌ ఆర్చిత రహార్‌, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్వో కె.హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement