ఐటీడీఏనా.. సీఎం సభనా? | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏనా.. సీఎం సభనా?

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

–8లో ఐటీడీఏనా.. సీఎం సభనా? ● అడుగడుగునా ఆంక్షలు ● రెండంచెల భద్రత దాటాకే సమావేశంలోకి.. ● పాలకవర్గ భేటీలో ఐటీడీఏ అధికారుల అత్యుత్సాహం

–8లో
● అడుగడుగునా ఆంక్షలు ● రెండంచెల భద్రత దాటాకే సమావేశంలోకి.. ● పాలకవర్గ భేటీలో ఐటీడీఏ అధికారుల అత్యుత్సాహం

యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు బడి, గుడితో పాటు సాక్షాత్తు ఆర్డీఓ కార్యాలయం ఉన్నా

అక్రమార్కులు లెక్క చేయడం లేదు.

సాక్షి, పార్వతీపురం మన్యం:

ప్రతి ఒక్కరికీ ఫొటో గుర్తింపుతో ప్రత్యేకంగా ముద్రించిన ఐడీ కార్డులు.. వాటితోపాటు, శాఖ ఐడీ కార్డు ఉంటేనే లోపలికి అనుమతి! ఇది కూడా చాలదు.. రెండంచెల ‘పోలీసు వలయం’ దాటాలి. అక్కడ అడుగడుగునా తనిఖీలు.. వారి వద్దనున్న జాబితాలో పేర్లు చూసుకుని, వచ్చేవారితో అవి సరిపోలితేనే, ‘టిక్కు’ పెట్టుకుని లోపలికి వదలడం.. జిల్లా అధికారి ఒక్కరికే లోపలికి అనుమతి.. వారితోపాటు ఇంకెవరొచ్చినా ‘నో వే’. మీడియాకు కూడా ఇవే ఆంక్షలు. తీరా చూస్తే.. ఇదేమన్నా ముఖ్యమంత్రి సభనా.. లేక, మంత్రివర్గ సమావేశామా? పోనీ ఏమైనా పార్లమెంట్‌లోకి వెళ్తున్నామా? అంటే అదీ లేదు. ఇంత హడావిడి గురువారం జరిగిన పార్వతీపురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికే! పార్వతీపురం ఐటీడీఏలో చాలీచాలని గిరిమిత్ర సమావేశ మందిరంలో పాలకవర్గ భేటీ పెట్టి.. జిల్లా అధికారులకు సైతం ముప్పతిప్పలు పెట్టించిన ఐటీడీఏ అధికారుల నిర్వాకమిదీ! ఐదేళ్ల తర్వాత నిర్వహించిన సమావేశానికి ఐటీడీఏ పీవో, ఏపీవో అత్యుత్సాహం చూపారు. గేటు వద్దే పోలీసులను మోహరించి, వచ్చేవారందరినీ అడ్డుకున్నారు. బయట వ్యక్తుల మాట దేవుడెరుగు.. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత వచ్చిన ఐటీడీఏ ఉద్యోగులను సైతం విధులకు వెళ్లనీయకుండా వెనక్కి పంపారు. ఇంత హడావిడి దేనికంటే.. అక్కడ ఓ ఉద్యోగి చెప్పిన సమాధానం.. ‘అందరూ వచ్చేస్తే భోజనాలు ఎక్కడ సరిపోతాయండీ’! సమావేశం కవరేజీకి వచ్చిన మీడియాకు సైతం ఆంక్షలు పెట్టడం తీవ్ర వివాదానికి కారణమైంది. చివరికి మంత్రి సంధ్యారాణి జోక్యం చేసుకుని, సమావేశంలో లోపలికి మీడియాకు అనుమతించాల్సి వచ్చింది. ఇంత హడావిడి చేసిన యంత్రాంగం.. టీడీపీ నాయకులకు మాత్రం రాచమర్యాదలు చేసింది. ఏ హోదా లేనప్పటికీ.. సమావేశం లోపల దర్జాగా పలువురు టీడీపీ నాయకులు కూర్చోవడం కనిపించింది. ఇవన్నీ చూసిన పలువురు అధికారులు సమావేశం తీరుపై పెదవి విరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement