● 81,401 మంది వివరాల పునఃపరిశీలనకు ప్రత్యేక డ్రైవ్ ● కొత్త ఓటర్ల నమోదుపైనా ప్రత్యేక దృష్టి
సాక్షి, పార్వతీపురం మన్యం:
అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితా లో ఉండేలా జిల్లాలో ఎన్నికల యంత్రాంగం మరో సారి క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా పునఃపరిశీలనతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. గతంలో ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా తొలగించిన.. తొలగింపునకు గుర్తించిన ఓటర్ల వివరాలను బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి మరోసారి పరిశీలించనున్నారు.
అందుబాటులో లేనివారు 12,205 మంది
సర్–2026లో భాగంగా జిల్లాలో మొత్తం 7,90,562 మంది ఓటర్ల వివరాలను పరిశీలించారు. వివిధ కారణాలతో 81,401 మంది ఓటర్ల వివరాలను పునఃపరిశీలనకు గుర్తించారు. వీరిలో 75,119 మంది ఏఎస్డీడీ ప్రక్రియలో, మరో 6,282 మంది నోటీసుల దశలో ఉన్నారు. 75,119 మందిలో 36,003 మంది మరణించిన వారిగా.. 12,205 మంది ఆచూకీ లేని లేదా అందుబాటులో లేనివారిగా గుర్తించారు. మరో 16,116 మంది ఇతర ప్రాంతాల కు శాశ్వతంగా తరలివెళ్లినట్లు, 10,705 మంది ఇప్ప టికే ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైనట్లు తేలింది. మరో 90మంది ఇతర కారణాల కింద ఉన్నారు.
అర్హులైతే తిరిగి అవకాశం
జాబితా నుంచి పేరు తొలగింపునకు గుర్తించినంత మాత్రాన అర్హులైన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్.ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. నోటీసుల దశలో ఉన్న 6,282 మంది వివరాలను నిబంధనల ప్రకా రం మరోసారి పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీల నలో వారు అర్హులుగా తేలితే, నిబంధనల ప్రకారం వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటారు.
18 ఏళ్లు నిండిన వారికి అవకాశం
జిల్లాలో కొత్త ఓటర్ల నమోదుపైనా ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, కళాశాల విద్యార్థు లు, ఇప్పటివరకు ఓటర్లుగా నమోదు కాని అర్హులైన పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఓటర్లు తమ దరఖాస్తులు, క్లెయిమ్ లు, అభ్యంతరాలను ఓటర్ హెల్‌లైన్ యాప్ లేదా ఓటర్స్.ఈసీఐ.జీఓవీ.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో సమ ర్పించవచ్చు. సంబంధిత బీఎల్వోలను సంప్రదించి తమ వివరాలను పరిశీలించుకోవడంతో పాటు అవసరమైన మార్పులు, నమోదుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ప్రజల సహకారం కీలకం
ఓటర్ల జాబితా ఎన్నికల సమయంలో మాత్రమే ఉపయోగపడే పత్రం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కును నిర్ధారించే కీలకమైన జాబి తా అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రజలు, యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రత్యేక డ్రైవ్‌కు సహకరించి అర్హులైన ప్రతిఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.


