● విద్యార్దులను అభినందించిన డీఈఓ బ్రహ్మాజీరావు
వీరఘట్టం/పార్వతీపురం రూరల్: వినూత్న ఆలోచనలతో విద్యార్థులు ఆవిష్కరించిన సైన్స్ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ మనక్ ప్రాజెక్ట్ కాంపిటిషన్‌కు జిల్లా నుంచి 2023–24 విద్యా సంవత్సరాల్లో 49 ప్రాజెక్ట్‌లు, 2024–25 విద్యా సంవత్సరంలో 48 ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో అన్ని మండలాల నుంచి నమోదు చేశారు. వాటిలో 2023–24 ఏడాదికి గాను 4 ప్రాజెక్ట్‌లను, 2024–25 ఏడాదికి గాను 5 ప్రాజెక్ట్‌లను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్) జిల్లా నుంచి మొత్తం 9 ప్రాజెక్టులను ఎంపిక చేసినట్లు డీఈఓ పి.బ్రహ్మాజీరావు, జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు గురువారం తెలిపారు.రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులు, గైడ్ టీచర్లను జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు ఎంపికై న విద్యార్దులు ఆయా పాఠశాలల నుంచి పదో తరగతి పూర్తి చేసి రిలీవ్ అయినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.


