● 23 తులాల బంగారం, 73తులాల వెండి స్వాధీనం
విజయనగరం క్రైమ్: గత నెల 30వ తేదీన విజయనగరం టూటౌన్ పరిధి వైఎస్‌ఆర్ నగర్‌లోని శ్రీసత్య నగర్‌లో జరిగిన దొంగతనం కేసులో విశాఖ జిల్లా మధురవాడకు చెందిన షేక్ అజీజ్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ కేసు అంశాలను ఎస్పీ దామోదర్ వెల్లడించారు. మధుర వాడకు చెందిన షేక్ అజీజ్ ఇప్పటివరకు పలు జిల్లాల్లో 50 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో గత నెల 30న పొట్టా వీర వెంకట స్వామి తన భార్యతో అన్నవరం దర్శనం చేసుకుని మర్నాడు 31 వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళం తెరిచి ఉంది. ఇంటి లోపల అన్ని తలుపుల గడియలు తీసి ఉండడం ఆపై బెడ్ రూమ్ లో బీరువా లాకర్ తెరిచి ఉండటం మంచంపై బీరువాలో సామగ్రి పడి ఉండడం లా కర్‌లో 23న్నర తులాల బంగారం, 73 తులాల వెండి వస్తువులు కనిపించకపోవడంతో లబో దిబో మంటూ ఆ రోజు రాత్రి టూటౌన్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జరిగిన దొంగతనాన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ దామోదర్ పది క్రైమ్ బృందాలను రంగంలోకి దించారు. పోలీసులకు అందిన సమాచారంతో నిందితుడు షేక్ ఆజీజ్ కాకినాడలో ఉండడంతో వారంట్ తీసుకు ని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా టూటౌన్ సీఐ శ్రీనివాస్ నిందితుడు షేక్ ఆజీజ్ ను తమదైన శైలిలో విచా రణ చేసి చోరీ కేసులో పోయిన ఆభరణాలను,నగదును రికవరీ చేశారని ఎస్పీ వివరించారు.
దాడిలో వ్యక్తికి గాయాలు
బాడంగి: మండలంలోని గజరాయునివలసకు చెందిన రెడ్డిగణేశ్‌ను అదే గ్రామానికి చెందిన మేనమామ నల్లతిరుపతినాయుడు, బావవరసైన భరత్‌రాజులు కర్రతో తలపై కొట్టి గురువారం రాత్రి గాయపరిచారు. భూతగాదాలో సొంత మేనల్లుడిపైనే దాడిచేసి కర్రతో కొట్టి తలపై గాయ పరిచారు. గణేష్‌కు తలపైగాయాలవగా రక్తస్రావంతో స్థానిక సీహెచ్‌సీలో చేరి ప్రథమ చికిత్సపొందాడు. బాధితుడు గణేశ్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్సై పి.సూర్యకుమారి కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.


