నేడు పీఎంవీబీఆర్‌వై జిల్లా స్థాయి కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

నేడు పీఎంవీబీఆర్‌వై జిల్లా స్థాయి కార్యక్రమం

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

నేడు పీఎంవీబీఆర్‌వై జిల్లా స్థాయి కార్యక్రమం చికెన్‌ ఠిబ్రాయిలర్‌ లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ157 శ్రీ284 శ్రీ294

చికెన్‌

కొత్త ఉద్యోగులకు నియమామక పత్రాల పంపిణీ

విజయనగరం అర్బన్‌/విజయనగరం టౌన్‌: ప్రధాన మంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన జిల్లాస్థాయి కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహిస్తామని ప్రాంతీయ ఈపీఎఫ్‌కమిషనర్‌ కణిత అవినాష్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఈపీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉపాధి అవకాశాలను పెంచడం, యువతను వ్యవస్థీకృత ఉద్యోగ రంగంలోకి తీసుకురావడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌ విధానంలో దేశవ్యాప్తంగా సుమారు 200 కేంద్రాల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పథకం కింద కొత్తగా ఉద్యోగాల్లో చేరిన తొలితరం ఉద్యోగులకు ఒక నెల జీతానికి సమానంగా గరిష్టంగా రూ.15 వేల వరకు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. అదనపు ఉద్యోగావకాశాలు కల్పించే యజమానులకు కూడా ఆర్ధిక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఈపీఎఫ్‌, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారులు, యాజమానులు, ఉద్యోగులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement