మద్యం ఫుల్‌.. పెట్రోల్‌ నిల్‌..! | - | Sakshi
Sakshi News home page

మద్యం ఫుల్‌.. పెట్రోల్‌ నిల్‌..!

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

పాలకొండ: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మద్యం ఊరూరా దొరుకుతోందని, ఆయిల్‌ కొరత ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిలు ధ్వజమెత్తారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాలకొండ పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద మంగళవారం ధర్నా చేశారు. దేశంలో ఎక్కడా లేని ఆయిల్‌ కొరత ఒక్క ఏపీలోనే వెంటాడుతుందన్నారు. ఆయిల్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంకుల్లో గంటల తరబడి వేచి ఉన్న వాహనచోదకులకు మజ్జిగ పంపిణీ చేశారు.

వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి

Advertisement
 
Advertisement
Advertisement