పాలకొండ రూరల్: ప్రస్తుత వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు శాప్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నిర్ణయించింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 65 పాఠశాలలకు చెందిన క్రీడా ప్రాంగణాల్లో పలు రకాల ఆటలపై ఔత్సాహిక క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు జిల్లా క్రీడా అధికారి సంబంధిత ఉపాధ్యాయులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 8 నుంచి 16 ఏళ్ల మధ్య గల ఔత్సాహికులకు శిక్షణ అందించేలా చర్యలు చేపట్టారు. మే నెల 1 నుంచి 30 వరకూ ఈ శిబిరాలు నిర్దేశిత పాఠశాలల్లో కొనసాగనున్నాయి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య క్రీడాకారులకు శిక్షణ అందిస్తారు.
జిల్లాలో శిబిరాల నిర్వహణ ఇలా..
పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సీతంపేట ఏపీటీడబ్ల్యూ ఆర్‌ఎస్, జీఎల్.పురం పి.ఆమిటి క్రీడాప్రాంగణం, ఇదే మండలం తాడికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (ఆర్చరీ), సీతానగరం మండలం బూర్జ జెడ్పీహెచ్‌ఎస్, పాలకొండ పట్టణం పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో, సీతంపేట కేవీకే, జీఎల్.పురం హెచ్ గ్రౌండ్స్, సీతానగరం మండలం గాజులవలస, వీరఘట్టం జెడ్పీహెచ్‌ఎస్‌లో (అథ్లెటిక్స్), పార్వతీపురం ఆఫీసర్స్ క్లబ్ ఇండోర్ స్టేడియం, చర్చివీధిలో గల మున్సిపల్ పార్కు, సాలూరు ఇన్‌డోర్ స్టేడియం, సీతంపేట మండలం కేవీకే ఇండోర్ స్టేడియం, మక్కువ మండలం వెంకటబైరిపురం జెడ్పీహెచ్‌ఎస్, కురుపాం మండలం గుమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం (బాడ్మింటన్), వీరఘట్టం మండలం తెట్టంగి జెడ్పీ ఉన్నత పాఠశాలలో (బాల్ బాడ్మింటన్), గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర జెడ్పీహెచ్‌ఎస్ (బేస్ బాల్), సీతంపేట కేవీకే (బాస్కెట్ బాల్), పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల బ్రాంచ్, స్థానిక
ఇందిరాకాలనీ ప్రాథమిక పాఠశాల, భామిని మండల పరిధిలో ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణం(బాక్సింగ్), పార్వతీపురం జట్టు ఆశ్రమం, ఇదే మండలం నర్సిపురం జెడ్పీ హెచ్‌ఎస్, రిషీ స్కూల్, కొమరాడ మార్కొండపుట్టి జెడ్పీహెచ్‌ఎస్‌లో (చెస్), కొమరాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం(క్రికెట్), పార్వతీపురం ఓల్డ్ బస్టాండ్ పార్కు ఏరియాలో (ఫెన్సింగ్), ఇదే మండలం నర్సిపురం జెడ్పీహెచ్‌ఎస్, కొమరాడ మండలం కోటిపాం జెడ్పీహెచ్‌ఎస్, జియ్యమ్మవలస మండలం కొత్తగూడ జెడ్పీ హెచ్‌ఎస్‌లో(హ్యాండ్‌బాల్), సీతంపేట కేవీకేలో (హాకీ), పార్వతీపురం జీయాన్ష్ ఇంటర్‌నేషల్ స్కూల్(జూడో), ఇదే పరిధిలో చాకలిబెలగాం ప్రైవేట్ గ్రౌండ్స్, పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సీతంపేట మండలం కేవీకే, పాచిపెంట మండలం పాంచాలి జెడ్పీ హెచ్‌ఎస్‌ఓ క్రీడా ప్రాంగణాల్లో (కబడ్డీ), పార్వతీపురం విద్యుత్ కేంద్రం, నోబెల్ స్కూల్, సాలూరు మండలం మామిడిపల్లి జెడ్పీహెచ్‌ఎస్, ఇదే మండలం టోనం జెడ్పీహెచ్‌ఎస్, కురుపాం మండలం రస్తకుంటుబాయి ఏఈ స్కూల్ క్రీడా ప్రాంగణం(కరాటే), పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (ఖోఖో), పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళశాల, పాలకొండ ప్రైవేట్ గ్రౌండ్స్‌లో (తైక్వాండో), పార్వతీపురం ప్రకాశం క్లబ్‌లో (టెన్నిస్), పార్వతీపురం పరిధిలో వెంకంపేట, ఎంఆర్‌నగర్ జెడ్పీహెచ్‌ఎస్, పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాలూరు జెడ్పీ హెచ్‌ఎస్, సీతంపేట మండలం కేవీకే, జీఎల్.పురం మండలం ఉదయపురం జెడ్పీహెచ్‌ఎస్, కొమరాడ మండలం బెన్నిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బలిజిపేట జెడ్పీహెచ్‌ఎస్ క్రీడా ప్రాంగణాల్లో (వాలీబాల్), పార్వతీపురం జీటీడబ్ల్యూ ఏహెచ్‌ఎస్‌లక్ష (వెయిట్‌లిఫ్టింగ్), పార్వతీపురం కేఎంహెచ్ రోడ్డు యోగా సెంటర్, జగన్నాథపురం, 5వ లైన్ గణేష్ నగర్, పాలకొండ ప్రభ్వు డిగ్రీ కళాశాల, ఇదే ప్రాంత పరిధి వడమ ఎంపీయూపీ స్కూల్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాలూరు శ్రీరామా యోగా సేవాసమితిలో యోగాపై శిక్షణలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఔత్సాహికులు వారికి నచ్చిన క్రీడల్లో తర్ఫీదు పొందేందుకు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.
శాప్ నేతృత్వంలో వేసవి క్రీడా శిక్షణ
మే 1 నుంచి ప్రారంభం
జిల్లా వ్యాప్తంగా 65 పాఠశాలల ఎంపిక
ఔత్సాహిక క్రీడాకారులకు
ఉపయుక్తం
నిపుణులతో పర్యవేక్షణ
వేసవి శిక్షణ శిబిరాలను సముచిత లక్ష్యంతో ఏర్పాటు చేశాం. బాధ్యతలను నేరుగా పర్యవేక్షిస్తాం. ఔత్సాహిక క్రీడాకారులకు నిపుణులు, అణుభవజ్ఞులైన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన, సీనియర్ క్రీడాకారులతో తర్ఫీదు అందించనున్నాం. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల ఉత్సుకతను గ్రహించి శిక్షణ శిబిరాలకు పంపించాలి. మరిన్ని వివరాలకు స్థానిక పాఠశాలల్లో సంప్రదించాల్సి ఉంటుంది.
– డాక్టర్ కె.శ్రీధర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, పార్వతీపురం మన్యం


