సరైన పరిహారం ఇవ్వకుండానే భూసేకరణ | - | Sakshi
Sakshi News home page

సరైన పరిహారం ఇవ్వకుండానే భూసేకరణ

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

హ్యాపీ హోం లేఅవుట్‌ బాధితుల

అందోళన

కొత్తవలస: రాయపూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణంలో భాగంగా కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం గ్రామం సమీపంలో గల హ్యాపీ హోం లేఅవుట్‌లో గల ప్లాట్‌ల యజమానులకు సరైన పరిహారం ఇవ్వకుండానే అదికారులు భూసేకరణ చేసేశారని సంబంధిత లేఅవుట్‌ ప్లాట్‌ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట లేఅవుట్‌లో ప్లాట్‌లు కొనుగోలు చేసుకున్న యజమానులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత లేఅవుట్‌లో సుమారు 30 సంవత్సరాల క్రితం నివాస అవసరాలకు ప్లాట్‌లను కొనుగోలు చేసుకున్నామని అప్పట్లో గజాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని, పరిహారం మాత్రం సెంట్లలో ఇచ్చారని ఈ ప్రక్రియ వల్ల తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ప్రభుత్వానికి గజాల్లో చలానాలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే అధికారులు మాత్ర సెంట్లలో పరిహారం అందజేశారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. నేషనల్‌ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోలేదని వాపోయారు.ఇప్పటికై నా జిల్లా మెజిస్ట్రేట్‌ అయిన కలెక్టర్‌ స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు.కార్యక్రమంలో పలువురు ప్లాట్‌లు కోల్పోయిన యజమానులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement