విజయనగరం అర్బన్: జర్నలిస్టులపై దాడులను ఐక్యంగా ఎదుర్కొందామని, ఆ దిశగా సంఘం పటిష్టత కోసం ప్రతిఒక్కరు అవగాహనతో ఉండాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పీఎస్‌వీప్రసాద్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా పరిషత్ మినిస్టీరిల్ సిబ్బంది సమావేశ భవనంలో సంఘ జిల్లా కమిటీ మంగళవారం నిర్వహించిన ఒక రోజు జర్నలిస్టుల శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఇటీవల సాక్షి మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులుపెడుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఖండించి ఐక్యపోరాటం చేశామన్నారు. శిక్షణ కార్యక్రమంలో జర్నలిస్టుల విధు లు, సంఘం ఐక్యత అంశాలను సీనియర్ జర్న లిస్టులు వివరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సంఘ జిల్లా కమిటీ త్వరలో నిర్వహించనున్న మహాసభ నిర్వహణపై సమీక్షించారు. సీనియర్ జర్నలిస్టు ఎలిశెట్టి సురేష్ కమిటీ చైర్మన్‌గా, మహాపాత్రో కో–చైర్మన్‌గా ఉన్న అడహాక్ కమిటీని జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు 11 మందితో ఏర్పాటు చేశారు. హైపవర్ కమిటీగా పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు అల్లు యుగంధర్, టి.రాధాకృష్ణ, పంచాది అప్పారావు, హిందూ శ్రీనివాస్, కొప్పర గాంధీతో పాటు మరో పది మంది సభ్యులను ఎంపిక చేశారు.


