అన్నదాత సుఖీభవ నిధులను వెనక్కి ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తాను ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని.. నిజమైన లబ్ధిదారులకు అందించాలని జేసీకి విజ్ఞప్తి కుట్రపూరితంగా నిధులు జమ చేశారని సందేహం
సాక్షి, పార్వతీపురం మన్యం: పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి అన్నదాత–సుఖీభవ నిధులు రూ.14 వేలు ఇటీవల జమయ్యాయి. తాను పథకం పొందేందుకు అనర్హురాలినని.. ఆ నిధులను ఆమె తిరిగి ఇచ్చేందుకు సిద్ధం అయ్యా రు. తాను దరఖాస్తు చేయనప్పటికీ.. ఆ మొత్తం జమ కావడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఏదో కుట్ర పూరితం ఇందులో ఉందని సందేహం వ్యక్తం చేశారు. తనకు జమ అయిన డబ్బులు తిరిగి తీసు కోవాలని కలెక్టరేట్‌లో సోమవారం సంయుక్త కలెక్ట ర్ యశ్వంత్ కుమార్ రెడ్డిని కలిసి కోరారు. రూ.14 వేలు నగదు అందజేశారు. ఆయన తీసుకునేందుకు నిరాకరించారు. పరిశీలించి, ఆ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు తీసుకోకుంటే డీడీ, చెక్కు రూపంలోనైనా తాను అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని కళావతి చెప్పారు.
అర్హులకు అన్యాయం చేస్తూ...
అర్హులకు అన్యాయం చేస్తూ అన్హులకు పథకాలు అందించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. అర్హులను, అనర్హులను కచ్చితంగా వేరు చేసి, కేవలం నిజమైన రైతు లబ్ధిదారులకే పెట్టుబడి నిధులు సక్రమంగా, సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జేసీను కోరారు. వండువ గ్రామంలో 1,435 ఎకరాల ఇనాం భూములకు సంబంధించి గత ప్రభుత్వ కాలంలో సుమారు 700 మంది రైతు లకు మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయ లు అయిదు సంవత్సరాల కాలంలో రైతు భరోసా ద్వారా అందించామని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక.. చాలామంది అర్హులకు పథకం అందలేద న్నారు. వారందరికీ న్యాయం చేయాలని.. తనకు పడిన అన్నదాత సుఖీభవ డబ్బులు వెనక్కి తీసుకోవాలని కోరారు. వాస్తవంగా మాజీ ఎమ్మెల్యే కళావతికి స్వగ్రామం వీరఘట్టం మండలం వండువలో కొంత భూములు ఉన్నాయి. ఆమె గతంలో బ్యాంక్ ఉద్యోగి.. పాలకొండ నియోజకవర్గం నుంచి పదేళ్లపాటు శాసన సభ్యురాలిగా ప్రజలకు సేవలందించారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారుగానూ ఉన్నా రు. ఆర్థికంగా స్వావలంబన కలిగిన ఒక మాజీ శాసన సభ్యురాలిగా, ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిగా, పేద రైతులకు అందవలసిన ఈ సంక్షేమ నిధులు తన ఖాతాలో పడడం అత్యంత హేయమైన, అమర్యాదకరమైన పరిణామంగా ఆమె భావించారు. ఈ డబ్బులు స్వీకరించడం సమ్మతం కాదని భావించి.. ఆ నిధులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి సిద్ధపడి, సంయుక్త కలెక్టర్‌ను కలిశారు.


