●పాత్రికేయ ముసుగులో
ఏబీఎన్ రాధాకృష్ణ పాత్రికేయ ముసుగులో చంద్రబాబు ప్రభుత్వాని కి బాకాలు ఊదుతున్నా రు. ఆయనకు నచ్చితే తప్పులు చేసినా జాకీలు పెట్టుకొని లేపుతారు. లేకుంటే బురద జల్లు తూ, విషం చిమ్ముతారు. పాత్రికేయ వృత్తి అంటే మాకు గౌరవం. రాధాకృష్ణ లాంటివారు జర్నలిజం పరువు తీస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి మేలు చేయడానికే ఆయన ఛాన ల్, పత్రిక ఉంది. వైఎస్సార్సీపీ నేతలు, మహిళ లు లక్ష్యంగా ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఇంత జుగుప్సాకర రీతిలో ఆయన పత్రిక ద్వారా మహిళల పట్ల విషం చిమ్ముతున్నా ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ స్పందించకపోవడం శోచనీయం. దీనికి రాధాకృష్ణ కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
– శత్రుచర్ల పరీక్షిత్ రాజు,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ.
పార్టీలో ఉన్న మహిళలు, మా కుటుంబ సభ్యుల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చాలా అనుచిత వ్యాఖ్య లు చేశారు. ఓ వైపు మహిళలకు ఏదైనా జరిగితే తక్షణమే వస్తామని పవన్ కల్యాణ్ అంటారు.. మహిళల పక్షపాతి ప్రభుత్వమని చంద్రబాబు చెబుతారు. చర్యలైతే ఎక్కడా లేవు. మహిళా హోం మినిస్టర్ అనిత కూడా ఎక్కడా స్పందించిన సందర్భం లేదు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన కాక ఇంకేంటి? పోలీస్ యంత్రాంగం పట్ల మాకు గౌరవం ఉంది. అందువల్లే మరో సారి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి విన్నవించుకుంటున్నాం. ఎస్పీ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వీధి పోరాటం చేసినా సరే.. కచ్చితంగా ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకునేటట్టుగా చేస్తాం.
– అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే,
పార్వతీపురం నియోజకవర్గం.


