పాలకొండ రూరల్: స్థానిక ముదునూరువారి వీధికి చెందిన లక్ష్మీకాంత్ అనే విద్యార్ధి కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మేడపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో చలించిపోయిన వివేకానంద హైస్కూల్ పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. దాదాపు రూ.2,20,000 మొత్తాన్ని విరాళంగా సేకరించి లక్ష్మీకాంత్ కుటుంబానికి అందించారు. ఈ సహాయాన్ని వివేకానంద హైస్కూల్ ప్రిన్సిపాల్ గవర పారినాయుడు, డైరెక్టర్లు, ప్రముఖ వ్యాపారవేత్త తుమ్మగుంట శంకరరావు, ఉపాధ్యాయులు కలిసి లక్ష్మీకాంత్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఔదార్యం, సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు.


