ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

కొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం సమీపంలో గల తోటలో రామలింగాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ సీముసిరి నర్సునాయుడు(38)ఆదివారం రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రసాదరావుతెలిపారు. నర్సునాయుడు రోజూ ఆటోలో లేబర్‌ను విశాఖపట్నం తీసుకుని వెళ్లి సాయంత్రం వారిని పికప్‌ చేసుకుని తీసుకొచ్ఛేవాడు.ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రాకపోవడంతో అనుమానం వచ్చి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వెతకగా అడ్డూరువానిపాలెం సమీపంలో గల మామిడితోటలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మృతుడికి 6,4 సంవత్సరాలు వయస్సుగల పాప,బాబు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement