గూడ్స్‌ రైలులో మంటలు | - | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ రైలులో మంటలు

Apr 26 2026 2:39 AM | Updated on Apr 26 2026 2:39 AM

బొండపల్లి: బొగ్గుతో రవాణా అవుతున్న గూడ్సు రైలులో మంటలు వ్యాపించిన సంఘటన మండలంలోని గరుడుబిల్లి రైల్వేస్టేషన్‌ వద్ద చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు.. రాయగడ నుంచి విశాఖపట్నం బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలులో ఒక భోగిలో మంటలు శుక్రవారం అర్ధరాత్రి రావడంతో స్టేషన్‌మాస్టర్‌ కిషోర్‌కుమార్‌ గమనించి స్టేషన్‌ వద్ద రైలును నిలిపివేశారు. ఈ విషయాన్ని గజపతినగరం అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వాహనంతో వచ్చి అగ్ని మాపక అధికారి రవి ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేయడంతో మిగతా భోగీలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. తర్వాత రైలును యాధావిధిగా విశాఖపట్నం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement