వసతులు కరువు | - | Sakshi
Sakshi News home page

వసతులు కరువు

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

వసతులు కరువు మండుటెండలో పనులు

పాలకొండ మండలం తుమరాడ గ్రామంలో కామినాయుడు చెరువు వద్ద 160 మంది వేతనదారులు ఎండలోనే పనులు చేపడుతున్నారు. ఇక్కడ పనులు జరుగుతున్న చోట కనీసం టెంట్లు, షెడ్డులు ఏర్పాటు లేదు. తాగునీరు, పనిముట్లు అందుబాటులో లేవు. రూ.9 లక్షలతో చేపడుతున్న ఈ చెరువు అభివృద్ధి పనుల్లో.. వేతనదారులకు కనీస వసతులు కల్పించడం లేదు. దీనికి తోడు మూడు నెలలుగా వేతన బకాయిలు కొనసాగుతున్నట్లు ఉపాధి వేతనదారులు వాపోతున్నారు.

● మైదాన ప్రాంతంలో ఫేస్‌యాప్‌తో ఓ రకమైన సమస్యలు ఉంటే.. సీతంపేట వంటి ఏజెన్సీ ప్రాంతంలో సిగ్నల్‌ దొరక్క యాప్‌ నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ మండలంలో 53 పంచాయతీలు, 431 గూడల పరిధిలో, 13వేల పై చిలుకు జాబ్‌ కార్డుదారులు ఉన్నారు. ప్రస్తుతం 12 వేల మంది వరకు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వీరికి సంబంధించి పనులు జరిగే చోట ఫేస్‌ యాప్‌లో వేతనదారుని వివరాలు నమోదు చేసేందుకు 436మంది మేట్లు పని చేస్తున్నారు. వీరంతా ఉపాధి పని జరిగే చోట సెల్‌ సిగ్నల్‌ ఉండకపోవడంతో సిగ్నల్‌ వచ్చే ప్రాంతానికి చేరుకొని యాప్‌ ఇన్‌స్టాల్‌చేసి, తిరిగి పని జరిగే ప్రాంతానికి వెళ్లి వస్తూ అవస్థలు పడుతున్నారు.

ఎండలు మండిపోతున్నాయి. తలదాచుకొనేందుకు నీడ లేదు. గతంలో టెంట్లు అందించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాగునీరు కూడా తెచ్చుకుంటున్నాం. పైగా వేతనాలకు మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలు పరిష్కరించడం లేదు. సాంకేతిక పేరిట ఇక్కట్లు తప్పడం లేదు. వేతన బకాయిలతో పాటు ఎండలో పనిచేస్తున్నందుకు ప్రత్యేక అలవెన్సులు అందించాలి.

– గుమ్మిడి తవిటినాయుడు,

ఉపాధి వేతన దారు, తుమరాడ

Advertisement
 
Advertisement
Advertisement