ఫేస్ యాప్ రద్దు చేయాలి..
గుమ్మలక్ష్మీపురం మండలం పరిధిలోని 27 పంచాయతీల్లో 12,808 జాబ్ కార్డులు ఉన్నాయి. శుక్రవారం 8,790 మంది వేతనదారులు ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్నారు. పనులు చేపడుతున్న ప్రదేశాల్లో సేదదీరేందుకు ఎక్కడా టెంట్లు గానీ.. తాగునీరు, పనిముట్లు, ప్రథమ చికిత్స పెట్టెల సదుపాయాలు గానీ కానరావడం లేదు. గతంలో పని ప్రదేశాల వద్ద మెడికల్ కిట్లతో పాటు టెంట్లు, తాగునీరు, పిల్లల్ని చూసుకునేందుకు ఆయాల వంటి సదుపాయాలు ఉండేవని.. ఇప్పుడవేమీ కానరావడం లేదంటూ వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. రోజూ ఫేస్ యాప్ నమోదు చేసుకోవాల్సి ఉండడం, సకాలంలో యాప్‌లో హాజరు నమోదు కాకపోవడం వల్ల వేతనదారులు ఇబ్బంది పడుతున్నారు.
ఎస్.కే పాడులో ఎండలోనే పనులు చేపడుతున్న వేతనదారులు
ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే ఫేస్ యాప్ ద్వారా హాజరును ఉదయం, సాయంత్రం వేళల్లో వేసుకోవాల్సి వస్తోంది. ముఖ హాజరు సక్రమంగా నమోదు కాకపోవడంతో ఎక్కువ సమయం హాజరు కోసం వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు ఎండ ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో పనులు చేయలేకపోతున్నాం. పాత విధానంలోనే హాజరును నమోదు చేయాలి.
– కడ్రక సీతారాం, వేతనదారుడు, నోండ్రుకోన గ్రామం,
చినగీసాడ పంచాయతీ


