న్యూస్‌రీల్
ఓ వైపు ఎండలు మండుతున్నా ఉపాధిహామీ పనుల వద్ద ఎక్కడా టెంట్‌లు కానరావడం లేదు.. తాగునీరు, మజ్జిగ సరఫరా మాటే లేదు.. రెండుపూటలా పనికి వెళ్లినా మస్తర్ పడుతుందోలేదోనన్న బెంగ.. యాప్‌లో ఫేస్ పడేవరకు వీడని ఉత్కంఠ.. ఫేస్ నమోదైతే హమ్మయ్య ఈ రోజుకు గండం గట్టెక్కిపోయామన్నంత ఉపశమనం.. ఎంత పైనినైనా చేసేందుకు సిద్ధపడే వేతనదారులు.. కనీస సదుపాయాలు లేక నీరసించిపోతున్నారు. మస్తర్ నమోదులో ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సకాలంలో వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ఉపాధిహామీ వేతనదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.


