పార్వతీపురం: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాని కి ప్రవేశపరీక్ష శుక్రవారం నిర్వహిస్తున్నట్లు బొబ్బిలి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. 5, 6, 7, 8 తరగతులకు సంబంధించి 386 మంది విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు పరీక్ష ఉంటుందన్నారు. అలాగే ఏపీఆర్‌జేసీలో ప్రవేశానికి 931 మంది విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలోని సురేష్ హైస్కూల్, కేపీఎం హైస్కూల్, శ్రీజన్ గ్లోబల్ పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలి పారు. ఆయా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు.
పార్వతీపురం రూరల్: స్థానిక బైపాస్ రోడ్డులోని శ్రీ సాయిరాం డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ రెడ్డి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్, టాటా టయో రేడియేటర్స్, అపోలో టై ర్స్, బ్లూ స్టార్ ఎలక్ట్రిక్, ఎజాకి ఇండియా లిమి టెడ్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పా ల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో పూర్తి చేసి న యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంపికైన వారికి వేతనంతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో శుక్రవారం ఉద యం 10 గంటలకు కళాశాల ప్రాంగణానికి హాజరుకావాలని కళాశాల కరస్పాండెంట్ కోరారు.
పార్వతీపురం: భగీరథ మహర్షి జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమల త జ్యోతి ప్రజ్వలన చేసి, భగీరథుని చిత్రపటా నికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ లక్ష్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమ ని, భగీరథుని కృషి యువతకు ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి అంద రూ బాధ్యతగా పనిచేయాలని, నీటి సంరక్షణ పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధి కారి ఇ.అప్పన్న, డీపీఆర్‌ఓ కె.బాలమాన్‌సింగ్, కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ జి. వెంకట నాయుడు, నాగవంశం డైరెక్టర్ హనుమంత్ శంకరరావు, శాలివాహన సంఘ జిల్లా అధ్యక్షుడు ఉరిటి యాదవ్ తదితరులు ఉన్నారు.
హెచ్‌ఐవీ నిర్మూలనపై శ్రద్ధ అవసరం
● రాష్ట్ర ఏపీశాక్స్ పీడీ రోణంకి గోపాలకృష్ణ
విజయనగరం ఫోర్ట్: వైద్యారోగ్యశాఖ చేపట్టే కార్యక్రమాలతో పాటు హెచ్‌ఐవీ నిర్మూలనపై దృష్టిసారించాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణశాఖ (ఏపీ శాక్స్) ప్రాజెక్టు డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. వైద్యారోగ్యశాఖ, వైద్యవిద్య, ఎయిడ్స్ నియంత్రణ శాఖ అధికారుల తో గురువారం జూమ్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎయిడ్స్ నియంత్రణపై పనిచేస్తున్న సిబ్బంది పని తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రోగులకు రోగనిరోధక శక్తి పెంచే మందులు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి, తదితరులు పాల్గొన్నారు.


