పార్వతీపురం: విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది పోస్టర్‌ను కలెక్టరేట్‌లో కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి ప్రత్యేక విద్యాప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆత్మవిశ్వా సం పెంపునకు మన్యం డాన్స్, సృజనాత్మకత కు, బొమ్మరిల్లు కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. గణితం, ఇంగ్లీష్, తెలుగు ప్రాథమి క నైపుణ్యాలపై దృష్టి సారించాలని, వెనుకబడి న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూ చించారు. బడి బయట ఉన్న పిల్లలను తిరిగి చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, డీఈఓ పి.బ్రహ్మజీరావు పాల్గొన్నారు.
పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో అసంతృప్తిదారులతో ఈనెల 29న ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ముఖాముఖిలో పార్వతీ పురం, పాలకొండ సబ్ కలెక్టర్లు, తహసీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటా రన్నారు. ముఖాముఖికి విచ్చేసే అర్జీదారులు గ్రీవెన్స్ రశీదు, ఎండార్స్‌మెంట్ కాపీని తీసుకు ని రావాలని సూచించారు.
నేడు భగీరథ మహర్షి జయంతి
భగీరథ మహర్షి జయంతి వేడుకలను గురువా రం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, కార్యక్ర మం విజయవంతం చేయాలని కోరారు.
పార్వతీపురం: రానున్న ఖరీఫ్‌కు రైతులకు ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎరువుల కంపెనీ ప్రతినిధు లు, డీలర్లు, మండల వ్యవసాయాధికారులతో బుధవారం మాట్లాడారు. రైతులపై అదనపు భారం వేసినా, నిబంధనలు ఉల్లంఘించినా డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల సరఫరా, స్టాక్ వివరాలు పారదర్శ కంగా నిర్వహించాలని, బలవంతపు అమ్మకా లు, అదనపు వసూళ్లు చేయరాదన్నారు. ఉల్లంఘనలపై లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నానో యూరియా, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలన్నారు. ఎరువుల పంపిణీపై పర్యవేక్ష ణ కొనసాగుతుందని, సమస్యల పరష్కారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్షలో జిల్లా వ్యవసాయాధికారి ఆర్.అన్నపూర్ణ పాల్గొన్నారు.


