వ్యక్తిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై కేసు నమోదు

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

వేపాడ: మండలంలోని శింగరాయి గ్రామానికి చెందిన గొల్ల సాయికుమార్‌పై అదే గ్రామానికి చెందిన కొరువాడ లక్ష్మణ్‌ సెలూన్‌ షాపులో ఉన్న కత్తితో దాడి చేయడంపై వల్లంపూడి ఎస్‌ఐ ఎస్‌.సుదర్శన్‌ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వల్లంపూడి పోలీసులు అందించిన వివరాలు.. శింగరాయి గ్రామానికి చెందిన కొరువాడ లక్ష్మణ వేపాడలో సెలూన్‌ షాపు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన గొల్ల సాయికుమార్‌, లక్ష్మణ్‌ గతంలో అండమాన్‌లో బాగానే ఉండేవారు. లక్ష్మణ్‌ కాస్త డబ్బులు సంపాదించి సాయికుమార్‌కు చెప్పకుండా శింగరాయి వచ్చేసి వేపాడలో రెండు నెలల కిందట సెలూన్‌ షాపు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్‌ ఒకటో తేదీ మధ్యాహ్నం వేపాడలో సెలూన్‌ షాపు నడుపుతున్న లక్ష్మణ్‌ వద్దకు సాయికుమార్‌ వచ్చి అండమాన్‌లో ఉన్నప్పుడు లక్ష్మణ్‌ కోసం ఖర్చు చేసిన సొమ్ము ఇమ్మని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో లక్ష్మణ్‌ తన షాపులో ఉన్న షేవింగ్‌ కత్తితో సాయి మెడపై గాయపర్చినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. గాయపడిన సాయికుమార్‌ను 108లో ఎస్‌.కోట తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. దీనిపై విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఎం.వీరాకుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వీఆర్‌ఓ కొండమ్మ, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement