విజయనగరం క్రైమ్: నగరంలోని కంటోన్మెంట్‌లో గల పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 37 వినతులు అందాయి. ఇందులో భూ తగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 6, మోసాలకు సంబంధించి 7, ఇతర అంశాలపై 13 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ.. ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలను డీపీఓకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్‌బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.


