అంతర్జాతీయ సైన్స్‌ఫెయిర్‌కు పూజిత | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సైన్స్‌ఫెయిర్‌కు పూజిత

Mar 24 2026 8:06 AM | Updated on Mar 24 2026 8:06 AM

లక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేటలో గల జ్యోతిబాపూలే బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన గేదెల పూజిత అంతర్జాతీయ సైన్స్‌ఫెయిర్‌కు ఎంపికై ందని ప్రిన్సిపాల్‌ యు.విజయ్‌కుమార్‌ పాత్రో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 28 నుంచి జూలై 4 వరకు జపాన్‌ దేశంలో సైన్స్‌ ఫెయిర్‌ జరుగుతుందని పేర్కొన్నారు. అరటి పంటలో వృథాగా వదిలేసిన దవ్వతో బయో సంచులు తయారీపై పూజిత చేసిన ప్రాజెక్ట్‌ అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని పూజిత, ప్రాజెక్ట్‌ గైడ్‌ జి.ఇంద్రజను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement