బలిజిపేట: మండలంలోని వెంగాపురం అగ్రహారం వీధి వెనుకున్న టేకుతోటల్లో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో ఈదురుగాలులు వీయడంతో మంటలు ఎగసిపడ్డాయి. కొద్ది సేపటి తర్వాత వర్షం పడడంతో మంటలు చల్లారాయి. చుట్టో, సిగరెట్టో కాల్చి పారేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పామాయిల్ తోటలో..
గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేటలో పల్లా చంద్రరావుకు చెందిన 30 ఎకరాల పామాయిల్ తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తోటలో గల డ్రిప్ ఇరిగేషన్ పైపులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి ప్రసాద్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్, బీడీ కాల్చి పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
చెరకు తోటలో..
బాడంగి: మండలంలోని భీమవరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో విశ్వనాథం వెంకట సుబ్రహ్మణ్యంనకు చెందిన సుమారు నాలుగు ఎకరాల్లోని చెరకు పంట అగ్నికి ఆహుతైంది. ఇదే సమయంలో గాలి వీయడంతో పక్కనే ఉన్న రెండు గడ్డి కుప్పలు కూడా బూడిదయ్యాయి. డొంకినవలస నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.


