గజపతినగరం రూరల్: గేట్ (గ్రాడ్యూయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)లో గజపతినగరం మండలం లోగిస గ్రామానికి చెందిన సామంతల జీవన్‌సాయితేజ ఆలిండియా స్థాయిలో 423 ర్యాంకు సాధించాడు. 100 మార్కులకు 58 మార్కులు స్కోర్ లభించడంతో సాయితేజకు ఈ ర్యాంక్ వచ్చింది. సాయితేజ ప్రస్తుతం హైదరాబాద్‌లో డీఆర్‌డీఓలో ట్రైయినీ రీచర్చ్ ఫెలోగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు సామంతుల సోంబాబు, తల్లి పైడిరాజు వ్యవసాయదారులు. మరోవైపు సాయితేజ కోల్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, ఎయిర్‌ఫోర్ట్ ఆఽథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కుమారుడు అటు చదువు, ఇటు ఉద్యోగ పరీక్షల్లో విజేతగా నిలవడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు.


