మనోహరమైన విజయం | - | Sakshi
Sakshi News home page

మనోహరమైన విజయం

Mar 20 2026 8:21 AM | Updated on Mar 20 2026 8:21 AM

పాలకొండ: గేట్‌–2026 ఫలితాల్లో పాలకొండకు చెందిన బొత్స మనోహరనాయుడు ప్రతిభ కనబరిచి ఆల్‌ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు సాధించాడు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో 872 స్కోర్‌ 69.33 మార్కులతో ఆల్‌ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు, ఇన్‌స్ట్రుమెంట్‌ ఇంజినీరింగ్‌లో 705 స్కోర్‌ 65.67 మార్కులతో ఆల్‌ ఇండియా స్థాయిలో 122వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి బొత్స వెంకటరమణ పాలకొండ పట్టణంలోని వెంకమ్మపేట ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తుండగా, తల్లి ప్రభావతి గృహిణి. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని పాలకొండ వాసులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement