బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Mar 20 2026 8:21 AM | Updated on Mar 20 2026 8:21 AM

విజయనగరం: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ఉత్తర్వుల మేరకు విజయనగరం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ ఎం.రాంసుందర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమిస్తానన్నారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలను సంపూర్ణగా కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల సంరక్షణ వంటి అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని, వాటిని మరింత మెరగుపరిచే దిశగా కార్యాచరణ చేపడతాన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరిం మెరుగైన సేవలందించేలా కృషి చేయాలని సూచించారు.

పూల సోయగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement