గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026
పొట్టకూటి కోసం వెళ్లిన శ్రమజీవులు... కష్టాన్ని ‘మూట’గట్టుకుని తిరుగుపయనమయ్యారు. గరుగుబిల్లి మండలం సింగ నాపురం గ్రామానికి చెందిన సుమారు 25 మంది కూలీలు 12 రోజుల కిందట మచిలీ పట్నం వెళ్లారు. అక్కడ మినప చేలల్లో కూలిపనులు ముగించుకుని వచ్చిన డబ్బు లతో ఉగాది వేళ ఊరికి చేరుకున్నారు. పార్వతీపురం బస్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి తమ గ్రామానికి వెళ్తున్న కూలీలను చిత్రంలో చూడొచ్చు.
– పార్వతీపురం రూరల్
చైత్రమాసం.. వసంత రుతువు.. శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ చిగుళ్లు తొడిగే ఆహ్లాదకర వాతావరణంలో వచ్చే పరాభవనామ తెలుగు సంవత్సరాదికి విజయనగరం బాబామెట్టలోని వరలక్ష్మి నాట్యాలయం విద్యార్థినులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. షడ్రుచుల సమ్మేళనమే జీవితమని చెబుతూ ఉగాది పచ్చడిని బుధవారం పంచిపెట్టారు. తెలుగు సంవత్సరాది జిల్లా ప్రజలందరికీ శుభాలివ్వాలని ఆకాంక్షించారు.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


