గ్రామానికి చెందిన వి.రామకృష్ణ నమ్మించాడు. రూ.35 వేలు నగదు తీసుకొని మోసగించారని బాధితుడు బలిజిపేట పోలీసులకు రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన మరికొంతమంది వద్ద కూడా మొత్తం రూ. 1,56,000 వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
●వీరఘట్టం మండలానికి చెందిన ఓ వ్యక్తి నకిలీ ఆర్డర్ కాపీ, ఫేక్ ఐడీ కార్డు చూపించి, విశాఖకు చెందిన మరొకరితో కలిసి రైల్వేలో ఉద్యోగాలపేరిట మోసాలకు పాల్పడ్డాడు. రూ.లక్షల్లో దోచేశారు. బాధితులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
●సీతంపేట మండలం బెనరాయికి చెందిన ముగ్గు రు గిరిజన యువకులకు ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి వారి నుంచి రూ.2.50 లక్షల చొప్పున అదే మండలానికి చెందిన దంపతులు దోచేశారు.


