సాక్షి, పార్వతీపురం మన్యం:
ఉద్యోగాలు.. ఉపాధి పేరిట నిరుద్యోగులను కొంతమంది బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు.. వివిధ యూనిట్లు ఇప్పిస్తామని మరికొందరు ఎరవేసి రూ.లక్షలు కాజేస్తున్నారు. జిల్లాలో ఈ ఘటనలు పెరిగిపోతున్నా యి. వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్ని అయితే.. మోసపోయామని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదుచేస్తే ఆ డబ్బులు కూడా వస్తాయో, రావో అని భయంతో ఇంకొందరు బాధితులు లబోదిబోమంటున్నారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో అప్పులు చేసి అడిగినంత కడుతున్నారు. అవి తీర్చలేక అవస్థ లు పడుతున్నారు. ఇటువంటి ఘటనలపై పోలీసులకు పరిమిత సంఖ్యలోనే ఫిర్యాదులు వెళ్తున్నాయి. కొన్నిచోట్ల ఏజెన్సీలు, థర్డ్ పార్టీ సంస్థల పేరిట టోకరా వేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలూ తక్కువ తినడం లేదు. ఇటీవల అంగన్‌వాడీ ఉద్యోగాలు, కేజీబీవీల్లో పోస్టులపేరిట భారీగా నొక్కేశా రు. ఉద్యోగాలు రాని బాధితులు అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా ఘటనలు కొద్ది రోజులుగా కురుపాం, పార్వతీపురం, సాలూరు వంటి చోట్ల వెలుగులోకి వచ్చాయి. పార్వతీపురంలో ఉద్యోగాల వ్యవహారమై టీడీపీకి చెందిన వ్యక్తుల మధ్య ఆడియో సంభాషణ బయట పడిన విషయం విదితమే. వారి మాటల్లో రూ.కోట్లు చర్చకు రావడం గమనార్హం. తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని నిరుద్యోగులకు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎర వేస్తున్నారు.
●ఇటీవల కురుపాం నియోజకవర్గానికి చెందిన సుమారు 75 మంది గిరిజన యువత కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు వచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర లో ఉద్యోగాలు అంటూ తమ వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకూ కాజేశారని వాపోయారు. వీరికి ఇచ్చిన నియామక పత్రాలతో నాలుగైదు నెలలు తమకు అప్పగించిన పంచాయతీల్లో విధులు కూడా చేపట్టారు. ఎంతకీ జీతాలు రాకపోవడంతో ఆరా తీయగా.. అప్పటికి గానీ, తెలియలేదు.. వారంతా మోసపోయారని.
●బలిజిపేట మండలం గళావల్లి గ్రామానికి చెంది న టొంపల పరశురామ్‌కు పీఎంఈజీపీ పథకం కింద రూ.10 లక్షల రుణాన్ని ఇప్పిస్తామని పలగర


