న్యూస్‌రీల్
నైతిక విలువల పతనం...
–8లో
కుదేలు...!
ఫ్యాషన్ ప్రపంచంలో దర్జీల జీవనం దయనీయంగా మారింది. అటు ప్రభుత్వం నుంచి సాయం అందక, ఇటు చేతికి పనిలేక ఇబ్బందులు
పడుతున్నారు.
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి తిరుమల పవిత్రత దెబ్బతింటోంది. ఆయన వ్యక్తిగత ప్రవర్తన, గత చరిత్ర హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయి. తిరుమల ప్రతిష్టను కాపాడటానికి ఆయన వెంటనే రాజీనామా చేయాలి. నిరసన తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై గూండాలతో దాడి చేయించడం, వారిపై అక్రమంగా పి.డి.యాక్ట్ కేసులు పెట్టడం ప్రజా స్వామ్య విరుద్ధం. ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభు త్వం చేసిందేమీ లేదు. పవన్ కల్యాణ్ ఫొటో షూట్లకు పరిమితమయ్యారు. గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు, రోడ్లు వారికి కనిపించడం లేదా? చంద్రబాబు అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ హైటెక్ సిటీ చూపిస్తారు తప్ప, ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. ఇప్పుడు అమరావతి, లడ్డు వివాదాలతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా పద్ధతి మార్చుకోకపోతే, గతంలో వలే మళ్లీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమయ్యేలా ప్రజలు బుద్ధిచెబుతారు.
– శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు
పార్వతీపురం రూరల్: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడాలని, అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎసా్‌స్‌ర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజుతో కలిసి మంగళవారం నిరసన గళం వినిపించారు. చంద్రబాబు అరాచక పాలనపై అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుమల క్షేత్ర పవిత్రను కాపాడాలని తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు, కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడులు, పోలీసుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గొంతు వినిపిస్తున్న వారిపై పి.డి.యాక్టులు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమంటూ నినదించారు. టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు అశ్లీల లీలలను సీఎం చంద్రబాబు పట్టించుకోకుండా పదవి కట్టబెట్టడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. రాజ్యాంగపరమైన పాలన అందించేలా చూడాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతులు అందజేశారు. నిరసన కార్యక్రమంలో కురుపాం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్, వైఎస్ చైర్మన్లు, వైఎస్ ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్లకార్డుతో నిరసన
వీడియో సాక్ష్యాలతో దొరికినా బీఆర్ నాయుడు సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారని, ప్రశ్నించిన మహిళలపై గూండాలతో దాడులు చేయించడం ఆయన అహంకారానికి నిదర్శనంగా ఉంది. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు కళ్లు, చెవులు మూసుకుని బీఆర్ నాయుడిని వెనకేసుకు రావడం దౌర్భాగ్యం. డ్రగ్స్ కేసులో దొరికిన ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇప్పించి కాపాడినట్లే, ఇక్కడ కూడా తన పార్టీ వారి తప్పులను చంద్రబాబు సమర్థిస్తున్నారు. తక్షణమే బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలి. అక్రమంగా అరెస్టు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
– అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలి
పార్వతీపురం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
చంద్రబాబు ఆరాచక పాలనపై ఆగ్రహం


