ఏరువాకకు సన్నద్ధం
తెలుగు సంవత్సరాది ఉగాదికి ఏరువాకకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 19వ తేదీన ఏరువాకకు వీలుగా కొత్తనాగళ్లను తయారుచేయిస్తున్నారు. గరుగుబిల్లి, చినగుడబ, వల్లరగుడబ, పెద్దూరు, లఖనాపురం, కొత్తపల్లి, తదితర గ్రామాల్లో కొత్తనాగళ్ల తయారీలో వడ్రంగులు బిజీ అయ్యారు. గతంలో రూ.800 ఉన్న నాగళి ఈ ఏడాది రూ.1000 నుంచి రూ.1200 పలుకుతున్నట్టు రైతులు చెబుతున్నారు.
– గరుగుబిల్లి
క్యాబేజీ బుట్ట ధర అమాంతం పడిపోయింది. నెల రోజుల కిందట మార్కెట్‌లో మూడుకిలోల బరువుతూగే బుట్ట ధర రూ.100 పలికేది. ఇప్పుడు రూ.5కు విక్రయించినా కొనుగోలుచేసేవారు కరువయ్యారంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చినా కోత, రవాణా ఖర్చులు రాకపోవడంతో పొలంలోనే విడిచిపెడుతున్నారు. కళ్లముందే ఎండిపోతున్న పంటను చూసి కన్నీరుపెడుతున్నారు. రైతు కష్టాలను పట్టించుకోని ప్రభుత్వతీరుపై నిట్టూర్చుతున్నారు.
– వీరఘట్టం


