న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు గుర్తింపు

Mar 18 2026 7:49 AM | Updated on Mar 18 2026 7:49 AM

విజయనగరం ఫోర్ట్‌: అధునాతన న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రెడ్డి శంకరరావు, వైద్య కళాశాల ఎంబీబీఎస్‌ విద్యార్థి వి. డానీకి గుర్తింపు లభించింది.

ఈ నెల 16న విశాఖపట్నంలోని గీతం మెడికల్‌ కాలేజీలో జరిగిన సమ్మిట్‌లో సమర్పించిన ‘ సర్టన్‌ లెడ్‌ నోవెల్‌ క్రానియోటోట్‌ అడాప్టర్‌ టు కన్వర్ట్‌ సర్టిఫైడ్‌ ఇంటి/డెంటల్‌ డ్రిల్‌ సిస్టమ్‌ ఆన్‌ ఎ న్యూరోసర్జరీ డ్రిల్‌ సిస్టం’ అనే విన్నూత పరిశోధన పత్రానికి ద్వితీయస్థానం లభించింది.

రూ.34 వేలు నగదు లభించింది. పరిశోధకులను స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.దేవీమాధవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లోక్‌నాఽథ్‌, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అల్లు పద్మజ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement