ఐక్యత, సోదర భావానికి ప్రతీక రంజాన్‌ వేడుక | - | Sakshi
Sakshi News home page

ఐక్యత, సోదర భావానికి ప్రతీక రంజాన్‌ వేడుక

Mar 17 2026 7:49 AM | Updated on Mar 17 2026 7:49 AM

ఐక్యత, సోదర భావానికి ప్రతీక రంజాన్‌ వేడుక

ఇస్తార్‌ విందులోపాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, వైఎస్సాఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు

కురుపాం: ఐక్యత, సోదర భావానికి ప్రతీక రంజాన్‌ పండగ అని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రంలోని శివ్వన్నపేటలో ముస్లిం సోద రులు సోమవారం ఇచ్చిన విఫ్తార్‌ విందులో వారు పాల్గొని విందును స్వీకరించారు. అనంతరం నిరుపేదలకు రంజాన్‌ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్‌ మాసం క్రమశిక్షణ, పేదల పట్ల కరుణను అలవర్చుకోవాల ని గుర్తు చేస్తుందన్నారు. నెలరోజులపాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసం పాటిస్తూ ఇఫ్తార్‌ విందులను పంచుకుంటూ ఐక్యత సోదరభావాన్ని ఈ పండగ చాటి చెబుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ నిషార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు షేక్‌ నూరెళ్ల, షేక్‌ ఆదిల్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ జిలాని, కురుపాం ఎంపీపీ శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ గొర్లి సుజాత, వైస్‌ ఎంపీపీలు బిడ్డిక అన్నాజీరావు, రంగారావు, మాజీ ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి, వివిధ పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు, వైఎస్సార్‌ సీపీ నాయకులు శెట్టి నాగేశ్వరరావు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement